ఐరోపా దేశాలకు కీలక పిలుపు... ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆసక్తికర పోస్ట్!

అవును... యాపిల్‌ ఐఫోన్‌ స్క్రీన్‌ పై 'రఫేల్‌ ఈజ్ కాలింగ్..' అని ఉండగా.. కింద మాత్రం 'మన యూరప్‌ ను రక్షించుకుందాం' అంటూ ఉన్న ఓ ఇమేజ్‌ ను మెక్రాన్‌ పోస్టు చేశారు.;

Update: 2025-06-21 05:20 GMT

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తాజాగా ‘ఎక్స్’ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో రఫేల్ పిలుస్తోందని.. మన యూరప్ ని సురక్షితంగా ఉంచుకుందామంటూ ఆయన పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన మిగిలిన వివరాలు ఏమీ వెల్లడించనప్పటికీ... ఈ పోస్ట్ వెనుక భారీ నిగూఢ అర్ధమే దాగుందని అంటున్నారు. దీంతో.. ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

అవును... యాపిల్‌ ఐఫోన్‌ స్క్రీన్‌ పై 'రఫేల్‌ ఈజ్ కాలింగ్..' అని ఉండగా.. కింద మాత్రం 'మన యూరప్‌ ను రక్షించుకుందాం' అంటూ ఉన్న ఓ ఇమేజ్‌ ను మెక్రాన్‌ పోస్టు చేశారు. దీన్ని 'ఎక్స్‌'లో షేర్‌ చేసిన ఆయన.. 'ఐరోపా మిత్రులారా.. మీకు ఓ సందేశం' అనే పదాన్ని జోడించారు. అయితే... ఈ పోస్ట్ వెనుక కీలక సందేశం ఉందని అంటున్నారు.

ఇందులో భాగంగా... తమ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని, అమెరికా దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఐరోపా దేశాలకు పిలుపునిచ్చినట్లుగా ఆ పోస్ట్ ఉందని చెబుతున్నారు పరిశీలకులు. అమెరికా యుద్ధ విమానాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, రఫేల్‌ ను ప్రత్యామ్నాయంగా చూడాలనేది ఆయన ఉద్దేశ్యమని చెబుతున్నారు.

రక్షణ రంగంలో యూరప్‌ స్వయం సమృద్ధి సాధించాలని పదే పదే చెబుతున్న మెక్రాన్‌.. ఇటీవల ఇదే విషయంపై ఓసారి మీడియాతో మాట్లాడారు. మిలటరీ హార్డ్‌ వేర్‌ విషయంలో ఐరోపా దేశాలు సహకారాన్ని పెంచుకోవాలని, అమెరికా దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలన్నారు. అమెరికా పరికరాలకు అలవాటు పడిన దేశాలకు ఐరోపాను ప్రత్యామ్నాయంగా చూపించాలన్నారు.

వాస్తవానికి... రక్షణ రంగంలో యూరప్‌ స్వయం సమృద్ధి సాధించాలని, అమెరికాపై ఆధారపడటం తగ్గించాలని పదే పదే చెబుతున్న మెక్రాన్‌.. ఇటీవల ఇదే విషయంపై మీడియాతోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా... మిలటరీ హార్డ్‌ వేర్‌ విషయంలో ఐరోపా దేశాలు సహకారాన్ని పెంచుకోవాలని, అమెరికా దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలని అన్నారు.

కాగా... ఫ్రాన్స్‌ కు చెందిన రఫేల్‌ యుద్ధ విమానాలను భారత్‌ వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే... పోలాండ్ 2020లో 4.6 బిలియన్‌ డాలర్లతో 32 ఎఫ్‌-35 యుద్ధవిమానాల కోసం ఒప్పందం చేసుకోగా.. ఫిన్లాండ్‌ కూడా 64 విమానాల కోసం 2021లో ఆర్డర్‌ చేసింది. వీటితోపాటు అనేక ఐరోపా దేశాలు ఇప్పటికే ఈ యుద్ధవిమానాలను వాడుతున్నాయి.

Tags:    

Similar News