లోకేష్ ట్వీట్ వైరల్ .... సీఎం సిద్ధరామయ్య వంతు

ఈ దెబ్బతో ఏపీ ఐటీ హబ్ అవుతుందని మంత్రి నారా లోకేష్ తాజాగా ట్వీట్ చేశారు. అంతే కాదు బెంగళూరు సహా ఇతర ప్రాంతాల నుంచి ఐటీ పరిశ్రమలు ఏపీకి తరలివస్తాయని చెప్పారు.;

Update: 2025-10-17 18:01 GMT

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ వేసిన ఒకే ఒక్క ట్వీట్ ఇపుడు కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అంతే కాదు పొరుగున ఉన్న తమిళనాడు సహా ఇతర రాష్ట్రాలలోనూ ప్రకంపనలు పుట్టిస్తోంది. దేశంలోనే అతి పెద్ద పెట్టుబడి ఏపీకి తరలి రావడం అంటే అది ఎనిమిదవ వింతగానే చాలా మందికి ఉంది. విభజన తరువాత ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉంది. అనుకున్నవి జరగకపోగా రాజధాని నిర్మాణం కోసం కూడా కష్టపడుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా అయితే ఏపీ అయితే లేదు.

గూగుల్ తో జిగేల్ :

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడుల వేట మొదలెట్టింది. ఎక్కడా ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా కూటమి పెద్దలు దేశాలు అన్నీ తిరిగి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తూ వచ్చారు. వాటి ఫలితంగా భారీ పెట్టుబడులే ఏపీకి వస్తున్నాయి. అయితే వచ్చిన వాటిలో ఎవరెస్ట్ శిఖర సమానంగా ఉన్నది గూగుల్ డేటా సెంటర్. ఇది ఒక్కటి చాలు అన్నట్లుగా ఇపుడు పెట్టుబడుల తులాబారంలో ఏపీ ఎంతో ఎత్తున ఉంది. ఏపీతో సరితూతే రాష్ట్రాలు అయితే కనుచూపు మేరలలో కనిపించడం లేదు అని అంటున్నారు.

ఏపీ ఐటీ హబ్ గా :

ఈ దెబ్బతో ఏపీ ఐటీ హబ్ అవుతుందని మంత్రి నారా లోకేష్ తాజాగా ట్వీట్ చేశారు. అంతే కాదు బెంగళూరు సహా ఇతర ప్రాంతాల నుంచి ఐటీ పరిశ్రమలు ఏపీకి తరలివస్తాయని చెప్పారు. దీంతో కర్ణాటకలోని రాజకీయం అంతా మారిపోయింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపక్ష బీజేపీ విమర్శలు ఎక్కుపెడుతూంటే వాటికి జవాబు ఇచ్చుకోలేక ప్రభుత్వ పెద్దలు లోకేష్ ట్వీట్ మీద పడుతున్నారు. ఏపీ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వంతు వచ్చింది. దాంతో ఆయన కూడా తన రియాక్షన్ ఏంటో ఇచ్చేశారు.

మాకు యాపిల్ ఉంది అంటూ :

మాకు యాపిల్ దిగ్గజ సంస్థ వచ్చింది కదా అని సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు. ఏపీలో యాపిల్ పెట్టుబడులు పెట్టలేదని కూడా సెటైర్లు పేల్చారు. మాకు రావాల్సినవి మాకు వస్తునాయి. అయినా ఎక్కడ ఎవరు పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు అని అన్నారు. అది ఇన్వెస్టర్ల ఇష్టమని కూడా ఆయన చెప్పారు. ఇక దీని కంటే ముందు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అలాగే మంత్రి ప్రియాంక్ ఖర్గె కూడా లోకేష్ ట్వీట్ల మీద హాట్ కామెంట్స్ చేశారు. ఖర్గే అయితే ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి అప్పుల గురించి కూడా ఎవేవో మాట్లాడారు. మొత్తం మీద చూస్తే గూగుల్ ఏపీకి రావడం కాదు కానీ పొరుగు రాష్ట్రాలు అయితే కిందా మీద అవుతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News