• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ కల్యాణ్ సవాల్ ను ...

పవన్ కల్యాణ్ సవాల్ ను సింగిల్ గా స్వీకరించిన నారా లోకేష్!

| అవును... ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 జరుగుతున్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-07-10 07:57 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్ని విధాలా మద్దతు, సహకారం.. రాష్ట్రం నుంచి కేంద్రానికి అన్ని విధాలా మంచి పేరు, తోడు అన్నట్లుగా కూటమి పార్టీల మధ్య అనుబంధం, అవగాహన సాగుతుందని అంటున్నారు. ఈ సమయంలో మోడీ ఇచ్చిన టాస్క్, పవన్ ఇచ్చిన సవాల్ ను లోకేష్ సింగిల్ గా టేకప్ చేశారు.

అవును... ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి సీఎం చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ప్రతి ఒక్కరి విజయం వెనుక ఉండేది, తరగతి గదిలో జీవిత పాఠాలు చెప్పేది గురువులని.. మన ఎదుగుదలను కోరుకునేది గురువులే అని అన్నారు. ఇదే సమయంలో... మనకు నడక, బాధ్యత నేర్పేది అమ్మ అని.. తల్లి పట్ల గౌరవం పెంచడానికే తల్లికి వందనం అని తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు.

ఇదే సమయంలో... పాఠశాలల్లో రాజకీయాలకు ఏమాత్రం తావు లేదని చెప్పిన లోకేష్.. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ జరుగుతోందని అన్నారు. ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు ఆటలు, పాటలు, యోగా నేర్పిస్తున్నామని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే పవన్ సవాల్ కు స్పందించారు. ఇందులో భాగంగా... అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని చెప్పిన లోకేష్... ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని పవన్‌ సవాల్‌ విసిరారని అన్నారు. ఈ సందర్భంగా.. "పవన్‌ సవాల్‌ ను నేను స్వీకరిస్తున్నా.. విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతాం" అని లోకేష్ తెలిపారు.

దీంతో... ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో కూటమి పార్టీల మధ్య పాలన సాగుతోందనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

Tags:    
  • NaraLokesh 
  • PawanKalyan 
  • ModiTask 
  • GreenChallenge 
  • EducationReforms 
  • APPolitics 
  • MegaPTM 
  • ParentsTeachersMeet 
  • ChandrababuNaidu 
  • AndhraPradesh 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS