'నేను యూత్' అంటున్న బుచ్చయ్య తాత: లోకేష్
దీంతో లోకేష్ చిరునవ్వు నవ్వి.. ''బుచ్చయ్య తాత కూడా యూతేనా?'' అని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బుధవారం ఆసక్తికర ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 9 గంటల కు లాబీలకు చేరుకున్న ఎమ్మెల్యేలు.. పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. ఈ సమయంలో మంత్రి నారా లోకేష అటుగా వచ్చారు. అక్కడ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే, మంత్రి ఫరూక్ ఉన్నారు. వీరంతా మాట్లాడుకుంటున్న సమయంలో లోకేష్ అటు రాగానే .. బుచ్చయ్య స్పందిస్తూ.. ''మా లీడర్ వచ్చారు'' అని వ్యాఖ్యానించారు.
దీంతో లోకేష్ చిరునవ్వు నవ్వి.. ''బుచ్చయ్య తాత కూడా యూతేనా?'' అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. బుచ్చయ్య తాత పూలపూల చొక్కాలు.. రంగురంగుల బట్టలు కట్టుకుని వస్తున్నారు... నేను చూడండి.. అంటూ తన దుస్తులను చూపించారు. ఈ క్రమంలో నేను యూతే.. అంటూ బుచ్చయ్య బదులిచ్చారు. అంతేకాదు.. యువ నేతలకంటే ఎక్కువగా తన నియోజకవర్గంలో తిరుగుతున్నానని చెప్పారు. కావాలంటే చూడండి అంటూ.. ఫోన్ తీసి ఫొటోలు చూపించే ప్రయత్నం చేశారు.
ఈ సమయంలో జోక్యం చేసుకున్న లోకేష్.. వచ్చే ఎన్నికల్లో యూత్‌కే ప్రాధాన్యం ఉంటుంది తాతా.. అంటూ నవ్వేశారు. ఇక, ఇదే సంభాషణలో జోక్యం చేసుకున్న వరదరాజులు రెడ్డి.. తనకు జస్ట్ 85 మాత్రమే నని అనగా.. ''ఔను.. వరదరాజులు రెడ్డిగారికి 85 ఏళ్లు వచ్చినా 45 ఏళ్ల నాయకుడిగా ఉంటారు'' అని లోకేష్ అన్నారు. ఇక, మంత్రి ఫరూక్ జోక్యం చేసుకుని.. ''నేను చంద్రబాబు కంటే చిన్నోడిని తెలుసా'' అని అన్నారు. తనకు చంద్రబాబుకు 20 రోజుల గ్యాప్ ఉందని అన్నారు. ఇలా.. లాబీల్లో ఆసక్తికర సంఘటనలో చోటు చేసుకున్నాయి.