• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కల్యాణ మహోత్సవంలో లోకేష్...

కల్యాణ మహోత్సవంలో లోకేష్ దంపతులు... బ్రాహ్మణి ఇంట్రస్టింగ్ పోస్ట్!

| ఈ సమయంలో... మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 12 గంటలకు నిర్వహించిన కల్యాణ మహోత్సవాల్లో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి పాల్గొన్నారు.

By - Tupaki Desk
Update: 2025-03-14 07:57 GMT

మంగళగిరి ప్రజలతో నారా లోకేష్ ఫ్యామిలీ మమెకమై, ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో... మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 12 గంటలకు నిర్వహించిన కల్యాణ మహోత్సవాల్లో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి పాల్గొన్నారు.


అవును... మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి కల్యాణ మహోత్సవాల్లో నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రభుత్వం తరుపున లోకేష్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం.. వేద మంత్రోఛ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య వైభవంగా జరిగిన స్వామి వారి కల్యాణాన్ని కనులారా వీక్షించి, అనుగ్రహం పొందారు.


ఈ సందర్భంగా వేదపండితులు.. మంత్రి నారా లోకేష్ దంపతుల రాకను పురస్కరించుకుని ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అంతకు ముందు.. స్వామివారి దేవాలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ దంపతులకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


ఈ సమయంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ దంపతులకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలను షేర్ చేస్తూ.. నారా బ్రాహ్మణి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ కల్యాణ మహోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.


ఈ సందర్భంగా... మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి 12.00 గం.లకు నిర్వహించిన స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చిందని.. మా దంపతులిద్దరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామి అనుగ్రహం కోరామని.. వేదపండితులకు నమస్కరించి ఆశీర్వచనాలు అందుకున్నామని బ్రాహ్మణి వెల్లడించారు.

Tags:    
  • NaraLokesh 
  • Brahmani 
  • Mangalagiri 
  • LakshmiNarasimhaSwamy 
  • KalyanaMahotsavam 
  • CulturalHeritage 
  • AndhraPradesh 
  • Devotion 
  • Tradition 
  • NaraFamily 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS