నీ తండ్రికి పట్టిన గతి నీకు పట్టిస్తాం..!

ఆ విషయం మరవక ముందు దివంగత బాబా సిద్ధిఖీ తనయుడు జీషన్ సిద్దిఖీ ని హత్య చేస్తామంటూ మెయిల్‌ వచ్చాయి.;

Update: 2025-04-22 10:58 GMT

బాలీవుడ్‌ సెలబ్రెటీలను భయపెడుతున్న లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ రాజకీయ నాయకులను సైతం వదిలి పెట్టడం లేదు. కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ ను బిష్ణోయ్ గ్యాంగ్‌ సభ్యులు కాల్చి హత్య చేసిన విషయం తెల్సిందే. ముగ్గురు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరపడంతో బాబా సిద్ధిఖీ మృతి చెందారు. బాబా సిద్ధిఖీ తర్వాత మహా పోలీసులు మరింతగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సెలబ్రెటీలను, రాజకీయ నాయకులను ఉంచుతున్నారు. ఇటీవలే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ సభ్యుడిని అంటూ మెసేజ్ చేసి హత్య చేస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.

ఆ విషయం మరవక ముందు దివంగత బాబా సిద్ధిఖీ తనయుడు జీషన్ సిద్దిఖీ ని హత్య చేస్తామంటూ మెయిల్‌ వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని, లేదంటే నిన్ను కూడా నీ తండ్రి మాదిరిగానే క్రూరంగా చంపేందుకు వెనకాడబోం అని హెచ్చరించారు. మెయిల్‌ ద్వారా పదే పదే హెచ్చరికలు రావడంతో జీషన్ సిద్దిఖీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే అయిన జీషన్ సిద్దిఖీ ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. గతంలో బాబా సిద్దిఖీని చంపిన వారిని, అందుకు సహకరించిన వారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు ప్రధాన ముద్దాయి కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు.

బాబా సిద్ధిఖీ మరణ వార్త మరవకముందే ఆయన కుమారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా ముంబై పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఇప్పటికే శాంతి భద్రతల విషయమై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇలా బెదిరింపులు రావడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన మెయిల్‌ ఆధారంగా నేరస్తులను ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీ అనే కంపెనీ నుంచి జీషన్ సిద్దిఖీ కి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఆ కంపెనీ వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే పోలీసులు కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

సల్మాన్ ఖాన్‌ను హత్య చేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హెచ్చరించిన విషయం తెల్సిందే. ఆ హెచ్చరికల నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌కి పదుల కొద్ది సెక్యూరిటీ కల్పిస్తున్నారు. పోలీసులు మాత్రమే కాకుండా పదుల కొద్ది ప్రైవేట్‌ సెక్యూరిటీతో సల్మాన్ ఖాన్‌ బయటకు వస్తున్నాడు. ఆ మధ్య బర్త్‌డే సందర్భంగా కూడా బుల్లెట్‌ ఫ్రూప్‌ గ్లాస్ నుంచి అభిమానులను చూసి అభివాదం చేయడం జరిగింది. లారెన్స్ బిష్ణోయ్‌ బెదిరింపులతో పోలీసులు తల పట్టుకున్నారు. జీషన్ సిద్దిఖీ కి ఇప్పటికే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన్ను కాపాడేందుకు పోలీసులు సాధ్యం అయినన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News