• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గాల్లో విమానం.. బాత్రూమ్‌...

గాల్లో విమానం.. బాత్రూమ్‌ లో మరణించిన పైలట్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

| విమానం గాల్లో ఎగురుతోంది.. ఇంతలో బాత్రూమ్‌ కు వెళ్లిన పైలట్‌ అక్కడ కుప్పకూలిపోయాడు

By - Tupaki Desk
Update: 2023-08-17 09:28 GMT

విమానం గాల్లో ఎగురుతోంది.. ఇంతలో బాత్రూమ్‌ కు వెళ్లిన పైలట్‌ అక్కడ కుప్పకూలిపోయాడు. ఎంతసేపటికి పైలట్‌ రాకపోవడంతో అప్రమత్తమైన కో పైలట్‌ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశాడు. అయితే అప్పటికే పైలట్‌ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నెల 13 రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఫ్లోరిడాలో మియామీ నుంచి చిలీ రాజధాని శాంటియాగోకి లాటామ్‌ ఎయిర్‌ లైన్స్‌ వాణిజ్య విమానం బయలుదేరింది.

ఈ క్రమంలో విమానం టేకాఫ్‌ అయిన మూడు గంటల తర్వాత పైలట్‌ ఇవాన్‌ ఆండౌర్‌ అస్వస్థతకు గురయ్యాడు. బాత్రూమ్‌ కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. ఆయన ఎంతకీ రాకపోవడంతో గమనించిన ఇతర సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం దక్కలేదు.

దీంతో అప్రమత్తమైన కో-పైలట్‌ విమానాన్ని సమీపంలోని పనామా సిటీలోని టోకుమెన్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. అనంతరం ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ సిబ్బంది వచ్చి హుటాహుటిన ఇవాన్‌ ను పరిశీలించారు. అయితే దురదృష్టవశాత్తూ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

కాగా ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 271 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. 56 ఏళ్ల ఇవాన్‌ గత 25 ఏళ్లుగా పైలట్‌గా పనిచేస్తున్నారు. పైలట్‌ మృతితో ఆ విమానంలోని ప్రయాణికులకు పనామాలోని హోటల్‌ లో వసతి కల్పించారు. మరుసటి రోజు వారికి చిలీకి చేర్చినట్లు లాటామ్‌ ఎయిర్‌ లైన్స్‌ తెలిపింది.

పైలట్‌ మృతి పట్ల లాటామ్‌ ఎయిర్‌ లైన్స్‌ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. పైలట్‌ ఇవాన్‌ ఆండౌర్‌ తమ ఎయిర్‌ లైన్స్‌ లో వెటరన్‌ పైలట్‌ అని.. అతడికి 25 ఏళ్ల అనుభవం ఉందని వెల్లడించింది. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయనను కాపాడుకోలేకపోయామని వాపోయింది.

Tags:    
  • Pilotdeath 
  • Pilot 
  • Heartattack 
  • Airplanebathroom 
  • Latampilot 
  • Latamairlines 
  • Cardiacarrest 
  • Miamiflight 
  • Ivanandaur 

Similar News

గిరి'జ‌నం'లో జ‌న‌సేన‌కు ప‌ట్టెంత‌.. ?

2026-11-08 17:30 GMT

'అప్పిరెడ్డి'పై అనుమానాలు.. గుంటూరు వైసీపీలో ఏం జ‌రిగింది..?

2026-11-08 16:30 GMT

''జ‌గ‌న్ ఊరుకోరు: ఇంచార్జ్‌ల‌ను మార్చేస్తారు.. ! ''

2026-11-08 15:30 GMT

కూట‌మి గెలుపు బాగుంది.. అస‌లు స్టోరీ ఏంటంటే.. !

2026-11-08 14:30 GMT

అమెరికాలో 22 ఏళ్ల తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి

2026-11-08 13:35 GMT

కొడాలికి లోకల్ షాక్.. గుడివాడలో తొలిసారి టీడీపీ ఇలా..

2026-11-08 13:34 GMT

నాడు సస్పెండ్ చేశారు.. నేడు దండలేసి ఆహ్వానిస్తున్నారు! స్థానిక రాజకీయంలో తిరగబడ్డ సీన్

2026-11-08 13:30 GMT

ఈ-20 వ‌ర్సెస్ 420 : రాహుల్ కొత్త వివాదం!

2026-11-08 12:30 GMT

కాంగ్రెస్ బ‌ల‌మా... ప‌ర్స‌న‌ల్ ఎటాచ్‌మెంటా.. ?

2026-11-08 11:15 GMT

జ‌గ‌న్ - అదానీ భేటీ.. పొలిటిక‌ల్ చ‌ర్చ నిజ‌మేనా ..?

2026-11-08 11:14 GMT

దుర్మార్గుడు... కేటీఆర్‌: రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు

2026-11-08 11:14 GMT

రిమాండ్ ఖైదీ సంచలన విజయం.. జడ్పీటీసీగా వైసీపీ నేతకు పట్టం కట్టిన ఓటర్లు

2026-11-08 11:14 GMT

Copyright @2026

Powered by Blink CMS