• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ‘కాంట్రాక్టులు...

‘కాంట్రాక్టులు ఇప్పిస్తానని వాడుకున్నారు’... వైసీపీ నేతపై అత్యాచారం కేసు!

| ఈ సమయంలో వైసీపీ నేత, మాజీ మంత్రిపై ఓ మహిళ ఫిర్యాదు చేశారు.

By - Tupaki Desk
Update: 2024-11-02 05:16 GMT

గత కొన్ని రోజులుగా వీడియో కాల్స్ లో న్యూడ్ గా కనిపిస్తున్న నాయకులు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాసేవకుల వ్యవహారాలు వరుసగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఆ పార్టీ, ఈ పార్టీ అనే తారతమ్యాలేవీ లేవు! అన్ని పార్టీల్లోనూ ఈ టైపు జనాలు ఉన్నారు. ఈ సమయంలో వైసీపీ నేత, మాజీ మంత్రిపై ఓ మహిళ ఫిర్యాదు చేశారు.

అవును... ఏపీలో పలువురు రాజకీయ నాయకుల (రాసలీలల) వ్యవహారాలు ఇటీవల కాలంలో వరుసగా వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. మహిళా నాయకులు, కార్యకర్తలతో న్యూడ్ కాల్స్ మాట్లాడే నాయకులు ఒకరైతే.. రకరకాల ఆశలు చూపించి సొంతపార్టీ మహిళా నేతలపై అఘాయిత్యాలకు పాల్పడేవారు మరొకరు.

ఈ నేపథ్యంలో... కాంట్రాక్టు పనులు లేదా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద డబ్బు తీసుకొని, తిరిగి ఇవ్వకపోవడంతోపాటు శారీరకంగా కూడా వాడుకున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, వైసీపీ నేత మేరుగ నాగార్జునపై విజయవాడకు చెందిన ఓ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. నాగార్జునపై అత్యాచారం, మోసం కేసులు నమోదు చేశారు.

ఇదే సమయంలో... మాజీ మంత్రి నాగార్జునకు సహకరించి, బాధితురాలిని బెదిరించారనే ఫిర్యాదు మేరకు ఆయన పీఏపైనా కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన బాధితురాలు... తనకు ఐదేళ్లుగా నాగార్జునతో పరిచయం ఉందని.. ఉద్యోగం లేదా కాంట్రాక్టులు ఇప్పిస్తానని చెప్పి తన వద్ద రూ.90 లక్షలు తీసుకున్నారని తెలిపారు.

ఈ క్రమంలో.. సార్ మీతో మాట్లాడతాను అన్నారని చెప్పి, ఆయన పీఏ తనను మంత్రి ఉండే అపార్ట్ మెంట్ కు తీసుకెళ్లేవాడని అన్నారు. వెళ్లిన వెంటనే బయట తాళాలు వేసి వెళ్లిపోయేవాడని అన్నారు. ఈ క్రమంలో తనకు ఎలాంటి కాంట్రక్టులు ఇప్పించకపోగా.. తనను బలవంతంగా నాలుగుసార్లు శారీరకంగా అనుభవించారని ఆమె ఆరోపించారు.

అయితే... ఈ ఆరోపణలను మాజీ మంత్రి నాగార్జున ఖండించారు. తనపై ఆరోపణలు చేసిన మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తన ప్రమేయం ఉన్నట్లు తేలితే ఎలాంటి పరీస్ఖలకైనా సిద్ధమని.. ఉరిశిక్షకైనా సిద్ధమేనని అన్నారు. ఆ మహిళ చెప్పిన రూ.90 లక్షలు, లోభారుచుకోవడానికి ప్రయత్నించాననడం అన్నీ అవాస్తవాలని.. ఇదంతా కుట్ర ప్రకారం జరుగుతుందని చెప్పారు!


Full View



Tags:    
  • Meruganagarjuna 
  • Thadepally 
  • Thadepalltpolice 
  • Exminister 
  • Andhrapradesh 
  • Ycp 
  • Jagan 
  • Allegations 
  • Crime 
  • Thadepallynews 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS