బ్రేకింగ్... హైదరాబాద్ వస్తోన్న విమానానికి బాంబు బెదిరింపు..!

ఇటీవల కాలంలో విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ వస్తోన్న ఘటనలు ఎక్కువగా నెలకొంటున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-12-02 06:21 GMT

ఇటీవల కాలంలో విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ వస్తోన్న ఘటనలు ఎక్కువగా నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా హైదరాబాద్ వస్తోన్న విమానంలో ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. ఈ విమానం కువైట్ నుంచి వస్తుండగా... అందులో మానవబాంబు ఉందంటూ ఈ-మెయిల్ వచ్చిందని చెబుతున్నారు. దీంతో.. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు.

అవును... మంగళవారం ఉదయం ఒక విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు ఈమెయిల్ రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఇండిగోకు చెందిన ఈ విమానం కువైట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. ఈ సమయంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని వెంటనే అత్యవసరంగా ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

ఈ సందర్భంగా స్పందించిన ఇండిగో ప్రతినిధి... డిసెంబర్ 2, 2025న కువైట్ నుంచి హైదరాబాద్ కు నడుస్తోన్న ఇండిగో విమానం 5ఈ1234కు భద్రతా ముప్పు వచ్చిందని.. దీని కారణంగా విమానాన్ని ముంబైకి మళ్లించడం జరిగిందని తెలిపారు. ప్రోటోకాల్ ను అనుసరించి.. విషయాన్ని వెంటనే సంబంధిత అధికారులను తెలియజేసినట్లు వెల్లడించారు.

ఈ సమయంలో.. మా ప్రయాణికులకు రీఫ్రెష్ మెంట్లు అందించడం, క్రమం తప్పకుండా అప్ డేట్స్ అందించడం వంటి అసౌకర్యాన్ని తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా... తమ ప్రయాణికులు, సిబ్బంది, విమానాల భద్రత అత్యంత ప్రాధాన్యతలని తెలిపారు.

మరోవైపు.. వారి ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ప్రయామ్నాయ విమానం కోసం ఏర్పాటు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన అధికారులు.. విమానం ల్యాండింగ్ తర్వాత ఐసోలేషన్ బే కు తరలించబడిందని తెలిపారు. ఈ సమయంలో.. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి.

Tags:    

Similar News