కర్నూలు డిమాండ్.. చిన్న ఎఫర్ట్‌తో పెద్ద మేలు ..!
ఇక, ఇప్పుడు జిల్లాల పేర్లు మార్పు, కొత్త మండలాల ఏర్పాటు నేపథ్యంలో తాజాగా ఉయ్యాలవాడ పేరు తెరమీదికి వచ్చింది.;
కర్నూలు జిల్లా. దీనికి చాలా చారిత్రక నేపథ్యం కూడా ఉంది. బ్రిటీష్ పాలన ఆ తర్వాత కూడా.. కర్నూలు ప్రాంతానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతానికి 1951లో కర్నూలు రాజధానిగా మారిం ది. ఇక్కడ నుంచే అనేక గెరిల్లా యుద్ధాలు కూడా జరిగాయి. ముఖ్యంగా బ్రిటీష్ వారిపై పోరాటాలకు.. ఇక్క డి ఖిల్లాలు.. ఆవాసాలుగా మారాయి. అలాంటి చారత్రక నేపథ్యం ఉన్న జిల్లా.. గత వైసీపీ హయాంలో రెం డుగా చీలిపోయింది.
కర్నూలు-నంద్యాల జిల్లాలు ఏర్పడ్డాయి. అయితే.. ఆ సమయంలో కర్నూలు జిల్లా పేరును మార్పు చేయా లని సూచనలు అందాయి. కానీ.. వైసీపీ నాయకులు లైట్ తీసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నేపథ్యంలో జిల్లా పేరును మార్చకూడదని కొందరు.. అలాకాదు, స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి పేరుకు సార్థకత చేకూరేలా..పేరు మార్చాలని మరికొందరు సూచించారు. మొత్తంగా ఈ వ్యవహారం అయితే.. అప్పట్లో తేలలేదు.
ఇక, 2023లో కర్నూలు పర్యటనకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కర్నూలు జిల్లాకు ఉయ్యాల వాడ పేరును పెట్టడం సముచితమని వ్యాఖ్యానించారు. దీనిని తాను సమర్థిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చా రు. దీంతో కర్నూలు వ్యాప్తంగా ఆశలు చిగురించాయి. గతంలో ఉయ్యాలవాడ పేరును విమర్శించిన నాయకులను ప్రజలు ఓడించారన్న వాదన కూడా బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే జిల్లా పేరును మార్చేందుకు వారు సుముఖత వ్యక్తం చేసినట్టు అయింది.
ఇక, ఇప్పుడు జిల్లాల పేర్లు మార్పు, కొత్త మండలాల ఏర్పాటు నేపథ్యంలో తాజాగా ఉయ్యాలవాడ పేరు తెరమీదికి వచ్చింది. కర్నూలుకు ఉయ్యాల వాడ పేరు పెట్టాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టు లు వస్తున్నాయి. అంతేకాదు.. ఇవి పవన్‌ను ఉద్దేశించి కూడా ఉంటున్నాయి. గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కానీ.. ఈ విషయంపై పవన్ మాత్రం ఇప్పటి వరకు దృష్టి పెట్టకపోవడం గమనార్హం. మరి ఆయన వ్యూహం ఏంటో చూడాలి. అయితే.. చిన్న ప్రయత్నం చేయడం ద్వారా కర్నూలు ప్రజల మనసులు చూరగొనే అవకాశం ఉంటందని పరిశీలకులు చెబుతున్నారు.