• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేటీయార్ నిజాలు...

కేటీయార్ నిజాలు ఒప్పుకుంటున్నారా ?

| పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను కేటీయార్ ఒక్కొక్కటే అంగీకరిస్తున్నారు. మొన్నేమో మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలో లోపాలున్నాయని అంగీకరించారు.

By - Tupaki Desk
Update: 2023-11-25 05:24 GMT

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను కేటీయార్ ఒక్కొక్కటే అంగీకరిస్తున్నారు. మొన్నేమో మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలో లోపాలున్నాయని అంగీకరించారు. తాజాగా ధరణి పోర్టల్లో లోపాలు నిజమే అని ఒప్పుకున్నారు. అందులో చాలా చిక్కులు, చికాకులున్నమాట వాస్తవమే అని చెప్పారు. ఇన్నిరోజులు ప్రతిపక్షాలు మేడిగడ్డ బ్యారేజి లోపాలు, ధరణి పోర్టల్లో అవకతవకలను ఎంత ఎత్తిచూపినా కేసీయార్,కేటీయార్ అంగీకరించలేదు. ఇప్పటికీ కేసీయార్ అంగీకరించటంలేదు కానీ మరి ఎందుకనో కేటీయార్ మాత్రం తప్పులు జరిగాయని అంగీకరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే పెద్ద కుంభకోణమని కాంగ్రెస్ ఎప్పటినుండో నానా రచ్చచేస్తున్నది. కాళేశ్వరం నిర్మాణమే ప్రపంచ అద్భుతమని ఇంతకాలం కేసీయార్, కేటీయార్, హరీష్ రావులు ఎదురుదాడులు చేస్తున్నారు. అయితే ఆమధ్య వచ్చిన భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అద్భుతమే జనాలందరికీ తెలిసిపోయింది. పంపు హౌస్ లు ముణిగిపోయాయి. ఇంజన్లు చెడిపోయాయి. భారీ వర్షానికే పంప్ హౌస్ ముణిగిపోయి, ఇంజన్లు చెడిపోవటమే చాలా విచిత్రమనిపించింది. ఇదిలా ఉండగానే మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ కుంగిపోవటం ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగిలినట్లయ్యింది.

ఇక ధరణి పోర్టల్ అయితే మరో బ్రహ్మాండమని కేసీయార్, కేటీయార్ చెప్పుకుంటున్నారు. ఇందులో లోపాలపై రైతులు, భూ యజమానులు ఎంత గోలచేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకనే ధరణి స్ధానంలో భూ భారతి అనే వ్యవస్ధను తీసుకొస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో పదేపదే చెబుతున్నారు. వీళ్లపై కేసీయార్ బహిరంగసభల్లో విరుచుకుపడుతున్నారు. భూ సయస్యల పరిష్కారానికి ధరణికి మించింది మరోటి లేదని కేసీయార్ ఊదరగొడుతున్నారు.

సరిగ్గా ఈ సమయంలోనే ధరణిలో లోపాలున్నాయని కేటీయార్ అంగీకరించటమే ఆశ్చర్యంగా ఉంది. పోర్టల్ నిర్వహణలో చాలా చిక్కులు, చికాకులున్నమాట వాస్తవమే అని ఒప్పుకున్నారు. కేటీయార్ ఒప్పుకోలుతో రేవంత్ అండ్ కో చేస్తున్న ఆరోపణలు నిజమే అని అంగీకరించినట్లయ్యింది. మరి దీనిపై కేసీయార్ ఏమంటారో ? భూ యజమనాలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి ఎన్నికల తేది దగ్గర పడుతున్న కొద్ది ప్రభుత్వ లోపాలను కేటీయార్ అంగీకరిస్తుండటమే విచిత్రంగా ఉంది.

Tags:    
  • Ktr 
  • Kaleswaram 
  • Brs 
  • Tselections 
  • Telanganaelections 
  • Harishrao 
  • Dhraniportal 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS