కవితకు ఇండైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన కేటీఆర్!
అయితే కేటీఆర్ తన ఫోకస్ అంతా కాంగ్రెస్ మీద సీఎం రేవంత్ రెడ్డి మీద పెట్టారు.;
తన సోదరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన కవితకు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదాన్ని మరింత పెంచారా అన్న చర్చ వస్తోంది. నిజానికి కేటీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు అంటే తన సోదరి కవిత మీద ఆమె రాసిన లేఖ మీద విరుచుకుపడతారని అంతా అనుకున్నారు.
అయితే కేటీఆర్ తన ఫోకస్ అంతా కాంగ్రెస్ మీద సీఎం రేవంత్ రెడ్డి మీద పెట్టారు. ఘాటైన పదజాలంతో రేవంత్ రెడ్డిని విమర్శించడం ద్వారా ఆయన కవిత లేఖ ద్వారా బీఆర్ఎస్ లో ఏర్పడిన సంక్షోభాన్ని ఏమీ లేదన్నట్లుగా చూపించారు అని అంటున్నారు. లైట్ తీసుకున్నట్లుగా ఆయన మాటలలో వ్యక్తం అయింది కానీ ఆందోళన మాత్రం అలాగే ఉంది అని అంటున్నారు.
లేఖల దేముంది లెండి అంటూ కేటీఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడారు. అయితే కవిత రాసిన లేఖ మీద మీడియా ఫోకస్ ఉండడంతో ఆయన మాట్లాడారు. అయితే డైరెక్ట్ గా తన సోదరి మీద విమర్శలు చేయకుండా పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని అన్నారు. అధినేత కేసీఆర్ ఒక్కరే నాయకులు అన్నారు. మేమంతా కార్యకర్తలమే అని చెప్పారు.
కేసీఆర్ కి పార్టీ నాయకులు ఎవరైనా లేఖలు రాయవచ్చు, ప్రజా సమస్యలు ప్రస్తావించవచ్చు అన్నారు. అంతే కాదు, ఏదైనా కానీ మాట్లాడే స్వేచ్చ బీఆర్ఎస్ లో ఉంది అని అన్నారు. అయితే ఏమి చేసినా అంతర్గతంగా ఉండాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అంతే తప్ప బాహాటం కారాదని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్ కి కవిత రాసిన లేఖ బాహాటం అయిన నేపధ్యంలో కేటీఆర్ ఇలా తన సోదరికి పరోక్షంగా కౌంటర్ వేశారని అంతా అనుకుంటున్నారు. ఇలా చెబుతూ తనతో సహా అందరికీ ఇదే రూల్ వర్తిస్తుందని అన్నారు. మరి కవిత విషయం ఆయన పేరు పెట్టి ప్రస్తావించకపోయినా ఆమెను ఉద్దేశించి మాత్రమే అన్నారని అంతా అనుకుంటున్నారు.
మరి కవిత లేఖ బాహాటం కావడం మీద మాత్రేమేనా లేక అందులో ఆమె ప్రస్తావించిన అంశాల మీద కూడా కేటీఆర్ విభేదిస్తున్నారా అంటే దానికి జవాబు అయితే ఆయన నుంచి లేదు. ఇంకో విషయం ఏమిటి అంటే బాహాటంగా లేఖలు రాయకూడదు అని కేటీయార్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్పారూ అంటే కవిత పార్టీ నియమావళిని ఉల్లంఘించినట్లే కదా అని అంతా అంటున్నారు.
మరి ఆమె ఆ విధంగా చేసినందుకు ఏ రకమైన చర్యలు ఉంటాయా అన్నది కూడా ఇపుడు చర్చగా ఉంది ఒక వేళ చర్యలు తీసుకుంటే అవి ఏ రకమైనవిగా ఉంటాయన్నది కూడా చూడాలని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే పార్టీలో కుట్రలు ఉన్నాయని కవిత అన్నారు. దయ్యాలు అన్నారు, కోవర్టులు అన్నారు. పార్టీ అధినేత వైఖరి మీద బీజేపీ మీద పార్టీ స్టాండ్ మీద ప్రస్తావించారు,
అంతే కాదు పార్టీలో మొదటి నుంచి ఉంటున్న వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు అని ప్రస్తావించారు ఇలా అనేక విధాలుగా కవిత తన లేఖలో అంశాలు ఉంచి మరీ బీఆర్ఎస్ కోటలో బాంబు లాంటి లేఖను పేల్చారు. మరి ఇంత చేసిన కవిత విషయంలో కేటీఆర్ మీడియా సమావేశంలో పెద్దగా మాట్లాడకపోవడంతో కచ్చితంగా ఈ సంక్షోభం కొనసాగుతోంది అని అంటున్నారు. మరి అది ఏ రూపం తీసుకుంటుందో చూడాలని అంటున్నారు.