సంచలనం... పూర్తి ప్రయాణ నిషేధానికి హోంల్యాండ్ సెక్యూరిటీ పిలుపు!

ఇప్పటికే కఠినంగా ఉన్న వలస చర్యలు.. తాజాగా ఉన్నతాధికారులు అందిస్తున్న పలు కీలక అభిప్రాయాలు వెరసి సమీప భవిష్యత్తులో ఇవి మరింత కఠినతరం కావొచ్చని అంటున్నారు.;

Update: 2025-12-02 13:16 GMT

ప్రత్యేకంగా పేరు చెప్పకపోయినా.. యునైటెడ్ స్టెట్స్ వలస నిషేధంపై మరింత కఠినంగా వెళ్లాలని కోరుకుంటోందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే కఠినంగా ఉన్న వలస చర్యలు.. తాజాగా ఉన్నతాధికారులు అందిస్తున్న పలు కీలక అభిప్రాయాలు వెరసి సమీప భవిష్యత్తులో ఇవి మరింత కఠినతరం కావొచ్చని అంటున్నారు. ఈ చర్చకు తాజా కారణం.. హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ పెట్టిన పోస్ట్!

అవును... వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్స్ పై దాడి.. మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేయాలంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించిన తన ఉద్దేశ్యం అనంతరం తాజాగా హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ సంచలన ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా ఇతర దేశాలపై పూర్తి ప్రయాణ నిషేధాన్ని విధించాలని ఆమె ప్రెసిడెంట్ ట్రంప్ ను కోరినట్లు తెలిపారు.

ట్రంప్ తో భేటీ తర్వాత స్పందించిన నోయెమ్... హంతకులు, జలగలను అమెరికాకు పంపుతున్న దేశాలపై పూర్తి ప్రయాణ నిషేదాన్ని సిఫార్సు చేసినట్లు తెలిపారు. అమెరికా వ్యవస్థాపకులు.. విదేశీ ఆక్రమణదారుల కోసం మన హీరోలను చంపడానికి, మనం కష్టపడి సంపాదించిన పన్ను డాలర్లను పీల్చుకోవడానికిలేదా అమెరికన్లకు రావాల్సిన ప్రయోజనాలను లాక్కోడానికి దేశాన్ని నిర్మించలేదని.. మేము వాటిని కోరుకోవడం లేదని ‘ఎక్స్’ లో రాసుకొచ్చారు.

ఇదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... ప్రతిపాదిత ప్రయాణ నిషేధం ద్వారా ప్రభావితమైన దేశాల జాబితాను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ప్రధానంగా.. వాషింగ్టన్ డీసీలో ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్స్ సభ్యులపై దాడి తర్వత వలసల సమస్య మళ్లీ తలెత్తిందని.. ఈసమయంలో దేశంలోకి విదేశీ పౌరుల ప్రవాహాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడానికి ప్రేరేపించిందని అంటున్నారు.

కాగా... వాషింగ్టన్ డీసీలో ఇద్దరు గార్డ్స్ పై కాల్పులు జరిపిన అనుమానితుడు 29 ఏళ్ల ఆఫ్గన్ వలసదారుడు రహ్మనుల్లా లకన్వాల్ వ్యవహారం అగ్రరాజ్యంలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో.. లకాన్వాల్ అమెరికాకు వచ్చిన తర్వాతే తీవ్రవాదానికి పాల్పడ్డాడని దర్యాప్తు అధికారులు నమ్ముతున్నట్లు నోయెమ్ అన్నారు.

ఈ నేపథ్యంలోనే... ఆఫ్ఘాన్ పాస్ పోర్ట్ హోల్డర్స్ కు వీసా జారీని అమెరికా విదేశాంగ శాఖ గత వారం పాజ్ చేసింది. ఇదే సమయంలో.. 19 దేశాల నుంచి, ఎక్కువగా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా నుంచి వచ్చిన వారికి గ్రీన్ కార్డుల సమీక్షను కూడా ప్రారంభించింది.

Tags:    

Similar News