కొండా రాజకీయం... అధిష్టానం రాయబారం.. నిజమేనా?
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ నాయకురాలు, ఎమ్మెల్యే తాజా మాజీ మంత్రి కొండా సురేఖకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందంటూ.. పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ నాయకురాలు, ఎమ్మెల్యే తాజా మాజీ మంత్రి కొండా సురేఖకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందంటూ.. పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆమెతో రాజీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నా యి. పార్టీ అధిష్టానం.. ఇప్పటి వరకు కొండా సురేఖను బుజ్జగించేలా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని.. ఇకపై కూడా ఉండకపోవచ్చని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ తనయ.. సుస్మిత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీంతో ఈ వ్యవహారం వివాదంగా మారింది. ఈ విషయంలో కుమార్తెను సమర్థించడం.. సీఎం రేవంత్‌పైనే ఎగస్పార్టీకంటే కూడా ఎక్కువగా స్పందించడంతో మొత్తంగా అధిష్టానం ఆమెను మంత్రి వర్గం నుంచి పక్కన పెట్టింది. ఇది జరిగి వారం పది రోజులు అయిపోయింది. అయితే.. అనూహ్యంగా.. అధిష్టానం.. కొండా సురేఖతో రాజీకి ప్రయత్నాలు ప్రారంభించిందని.. ఆమెను బుజ్జగిస్తోందని వార్తలువ చ్చాయి. వీటిపై వివరణ ఇచ్చిన గాంధీ భవన్ అలాంటి సమాచారం తమకు లేదని పేర్కొనడం గమనార్హం.
మరోవైపు.. కొండా సురేఖ..తన నెక్ట్స్ స్టెప్‌పై పార్టీ కార్యకర్తలు, తమ అనుచరులతో హనుమకొండలో ఆదివారం విందు సమావేశం నిర్వహించారు. దీనికి 200 మంది అనుచరులు వస్తారని అంచనా వేశారు. ఈ సమావేశంలో ఆమె తదుపరి నిర్ణయం ప్రకటించే వీలు ఉంటుందని తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం బీజేపీ, బీఆర్ ఎస్ వంటి పార్టీల్లో ఆమెకు అవకాశం లేకపోవడం.. కాంగ్రెస్ పార్టీలో దూరం పెట్టిన నేపథ్యంలో సురేఖ రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఆమె ముందున్న ఏకైక ఆప్షన్.. కవిత పార్టీ టీఆర్ ఎస్ మాత్రమేనని పరిశీలకులు చెబుతున్నారు.