• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మాజీ మంత్రి కొణతాల రూటు...

మాజీ మంత్రి కొణతాల రూటు ఎటు...!?

| మాజీ మంత్రి మాజీ ఎంపీ కొణతాల రామక్రిష్ణ పొలిటికల్ రూట్ ఎటు వైపు అన్న ప్రశ్న ముందుకు వస్తోంది

By - Tupaki Desk
Update: 2023-12-14 03:47 GMT

మాజీ మంత్రి మాజీ ఎంపీ కొణతాల రామక్రిష్ణ పొలిటికల్ రూట్ ఎటు వైపు అన్న ప్రశ్న ముందుకు వస్తోంది. ఆయన కాంగ్రెస్ లో రెండు దశాబ్దాల పాటు మకుటం లేని మహరాజుగా మారి ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలను శాసించారు. ఆ తరువాతనే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. 2009లో ఆయన మంత్రిగా ఉండి అనకాపల్లిలో ఓడారు. ఆ తరువాత వైఎస్సార్ మరణంతో కొణతాల రాజకీయం మసకబారుతూ వచ్చింది. గట్టిగా చెప్పాలీ అంటే గత పదిహేనేళ్ళుగా ఆయన ఏ పదవిలోనూ లేక ఏ పార్టీలోనూ కుదురుగా లేక ఇబ్బంది పడుతున్న నేపధ్యం ఉంది.

వైఎస్సార్ మరణానంతరం కొణతాల వైసీపీలో చేరారు. కానీ అక్కడ ఆయన ఉండలేకపోయారు. ఇక 2019 ఎన్నికల ముందు టీడీపీకి మద్దతు ప్రకటించిన ఆయన ఆ పార్టీలోనూ కొనసాగలేదు ఇపుడు 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఒక విధంగా చూస్తే కొణతాల రాజకీయ జీవితానికి ఇవి చివరి ఎన్నికలు అని అంటున్నారు. అందుకే ఆయన ఈసారి సరైన రాజకీయ నిర్ణయం తీసుకుని పోటీ చేయాలని చూస్తున్నారని టాక్.

ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్నది ఒక చర్చగా ఉంది. అయితే ఆయన టీడీపీలో చేరుతారు అని ప్రచారం అయితే సాగుతోంది. కొణతాల 2019లో టీడీపీలోనే ఉంటూ ప్రచారం చేశారు కాబట్టి ఆ పార్టీ మనిషి కిందనే అంతా చూస్తున్నారు. అయితే ఆయన రాజకీయంగా యాక్టివ్ గా లేకపోవడం వల్ల మరోసారి పసుపు కండువా కప్పుకుని అఫీషియల్ గా చేరిపోతారు అని అంటున్నారు.

అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. కొణతాల అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అలా అయితేనే ఆయన టీడీపీలో చేరుతారు అని అంటున్నారు. నిజానికి 2019లో కూడా అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించి ఆన పార్టీలో చేరినా అది దక్కలేదు. ఈసారి అయినా ఆయనకు ఆ చాన్స్ ఉంటుందా అన్నది ప్రశ్నగా ఉంది.

ఇక తెలుగుదేశం పార్టీ అయితే అంగబలం అర్ధబలం ఉన్న వారినే ఏరి కోరి మరీ ఎంపీ సీటుకు పోటీ పెట్టనుంది. అలా చూసుకుంటే కనుక ఒక పారిశ్రామికవేత్త పేరు ప్రచారంలో ఉంది. ఆయన బలమైన సామాజిక వర్గం నేపధ్యం ఉన్న వారు అని కూడా అంటున్నారు. ఒక వేళ ఆయన కాకపోతే అపుడు వేరే వారిని ఆలోచిస్తారు అని అంటున్నారు.

మరి కొణతాలకు టికెట్ ఇస్తారా అంటే ఆయన దశాబ్దన్నర కాలంగా రాజకీయంగా అంత క్రియాశీలకంగా లేరు కాబట్టి ఆలోచిస్తారు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా కొణతాల అభిమానులు మాత్రం తమ నాయకుడు సరైన టైం లో రీ ఎంట్రీ ఇస్తారు అని అంటున్నారు. మరి ఆయన టీడీపీలో చేరుతారా లేక తన పూర్వపు పార్టీ అని వైసీపీని ఎంచూంటారా అన్నది అయితే ప్రస్తుతానికి సస్పెన్స్. ఏది ఏమైనా ఎంపీ క్యాండిడేట్ గానే కొణతాల ఉంటారు అని అంటున్నారు.

Tags:    
  • Konathalaramakrishna 
  • Ycpgovernment 
  • Congress 
  • APPolitics 
  • TDP 
  • Assemblyelections 
  • Formerminister 

Similar News

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

Copyright @2026

Powered by Blink CMS