ఆ నగరం జీవించేందుకు సేఫ్.. సర్టిఫై చేసిన ఎన్‌సీఆర్‌బీ

ఏ ప్రదేశమైనా.. ఏ గ్రామమైనా.. ఏ నగరమైనా.. భద్రతా పరంగా సురక్షితమో అక్కడే ఉండేందుకు ప్రజలు ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.;

Update: 2025-10-06 13:30 GMT

ఏ ప్రదేశమైనా.. ఏ గ్రామమైనా.. ఏ నగరమైనా.. భద్రతా పరంగా సురక్షితమో అక్కడే ఉండేందుకు ప్రజలు ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. డెవలప్ కూడా అదే విధంగా కొనసాగతుంటుంది. రాష్ట్రాల రాజధానుల విషయంలో ఇది మరీ ముఖ్యం ఎందుకంటే.. ఆ రాష్ట్రానికి సంబంధించి డెవలప్ మెత్తం రాజధానిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే అక్కడ పని చేసేందుకు ఎక్కువ మంది వ్యక్తులు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశం భద్రంగా ఉండాలని కోరుకోవడం సబబే కదా..

ఎన్‌సీఆర్‌బీ నివేదికలో ఈ రాజధాని సేఫ్..

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన 2023 నివేదిక, దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల భద్రతా చిత్రపటాన్ని కళ్ల ముందు ఉంచింది. ఈ నివేదికలో అత్యంత ప్రముఖంగా నిలిచిన అంశం వరుసగా నాలుగో సంవత్సరం కూడా కోల్‌కతా దేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా (లక్ష జనాభాకు 83.9 గుర్తించదగిన నేరాల రేటుతో) స్థానం దక్కించుకుంది. ఇది కేవలం గణాంకాల విజయం మాత్రమే కాదు.. నగర పాలన, పోలీస్ వ్యవస్థ సమర్థతకు నిదర్శనం.

కోల్‌కత్తా దేశంలోని ఇతర ప్రధాన నగరాలైన హైదరాబాద్, పూణె, ముంబై కంటే తక్కువ నేర రేటును నమోదు చేయడం ప్రశంసనీయం. నేరాల రేటు రెండేళ్లలో (2021లో 103.5 నుంచి 2023లో 83.9కి) గణనీయంగా తగ్గడం సంతోషించతగ్గ విషయం. ఇక్కడి 94.7 శాతం చార్జిషీటింగ్ రేటు (కొచ్చి 97.2 శాతం తర్వాత రెండో స్థానం) నమోదైన నేరాలపై విచారణ, కేసు పరిష్కారంపై పోలీసుల చిత్తశుద్ధిని, చట్టం పట్ల పౌరుల్లో విశ్వాసాన్ని కలిగిస్తుంది. మరోవైపు, దేశంలోని 19 మెట్రో నగరాల సగటు నేరాల రేటు లక్షకు 828 గా ఉంది. ఇది కోల్‌కత్తా రేటుతో పోలిస్తే దాదాపు 10 రెట్లు అధికం. ఈ వ్యత్యాసం, భద్రత విషయంలో దేశంలో రెండు వేర్వేరు చిత్రాలను చూపుతోంది.

ఆందోళన కలిగించే ప్రాంతాలు..

కోల్‌కత్తా సురక్షిత నగరంగా నిలబడగా.. నివేదికలో ఇతర రాజధానుల విషయంలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కొచ్చి (3192.4), ఢిల్లీ (2105.3), సూరత్ (1377.1) వంటి నగరాలు అధిక నేరాల రేటును నమోదు చేశాయి. ముఖ్యంగా.. కొచ్చిలో లక్ష జనాభాకు నేరాల రేటు జాతీయ మెట్రో నగరాల సగటు (828) కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉండడం, ఆ ప్రాంతాల్లోని పాలనా వైఫల్యం లేదా నేరాల నమోదులో పారదర్శకతను సూచిస్తుంది. అహ్మదాబాద్ లక్ష జనాభాకు 839.3 నేరాల రేటుతో సురక్షిత నగరాల జాబితా చివరలో ఉంటూనే, అధిక నేరాల నగరాల జాబితాలో భాగమైంది.

గణాంకాలను ఎలా అర్థం చేసుకోవాలి?

ఎన్‌సీఆర్‌బీ నివేదికలో చెప్పినట్లు ఈ గణాంకాలు కేవలం పోలీసులకు నివేదించిన, నమోదు చేసిన నేరాలను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ క్లిష్టమైన అంశాన్ని గుర్తించాలి. తక్కువ నేరాల రేటు అంటే ఆ నగరంలో నేరాలు తక్కువగా జరుగుతున్నాయా..? లేక ఫిర్యాదుల నమోదు (ఎఫ్ఐఆర్) తక్కువగా ఉందా..? దీనికి విరుద్ధంగా.. కొచ్చి లేదా ఢిల్లీలో అధిక సంఖ్యలో నేరాలు నమోదవడం, ఆ నగరాల్లో పోలీసులు ప్రతి ఫిర్యాదును స్వీకరించి, నమోదు చేయడంలో అధిక పారదర్శకత చూపుతున్నారని అర్థం చేసుకోవచ్చు.

భద్రతా విషయంలో రాజీపడని నగరం..

అయితే, కోల్‌కత్తా నేరాల రేటు (83.9), అధిక చార్జిషీటింగ్ రేటు (94.7%) పరిశీలిస్తే.. ఆ నగరం నేర నివారణ, కేసుల పరిష్కారంలో ఒక సమతుల్యతను సాధించిందని తెలుస్తోంది. ఇతర నగరాలు భద్రతా విషయంలో కోల్‌కత్తా సాధించిన విజయాలను పరిశీలించి, వాటి పాలనా పద్ధతులు, కమ్యూనిటీ పోలీసింగ్‌, నేరాల నివారణ వ్యూహాలను అనుసరించడం అవసరం. ఇది కేవలం సంఖ్యలకే పరిమితం కాదు.. పౌరుల జీవన ప్రమాణం, విశ్వాసానికి సంబంధించింది.

Tags:    

Similar News