• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'కొడాలి నాని పంచాల్సిన...

'కొడాలి నాని పంచాల్సిన డబ్బులు దోచేశారు'... వీడియో హల్ చల్!

| ఎన్నికల సీజన్, అన్ సీజన్ అనే సంబంధాలతో సంబంధం లేకుండా ఏపీ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక అంశం హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది

By - Tupaki Desk
Update: 2024-05-19 07:12 GMT

ఎన్నికల సీజన్, అన్ సీజన్ అనే సంబంధాలతో సంబంధం లేకుండా ఏపీ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక అంశం హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. పోలింగ్ పూర్తయినా.. ఫలితాలకు ఇంకా సమయం ఉన్నా కూడా ఏపీ రాజకీయాలు చప్పబడే, చల్లబడే ప్రస్తక్తే లేదన్నట్లుగా సాగుతుంటుంది. ఈ సమయంలో గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని తరుపున పంచాల్సిన సొమ్మును కాజేశారంటూ ఒక వ్యక్తి ఆరోపిస్తున్న వీడియో తెరపైకి వచ్చింది.

అవును... ఓటర్లకు డబ్బు పంచకుండా కొందరు కాజేశారంటూ గుడివాడ వైసీపీ మైనార్టీ సీనియర్ నేత సర్దార్ బేగ్ ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఆయన ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆ డబ్బులు తీసినవాళ్లు తప్పు ఒప్పుకుంటే సరేసరి కానీ.. తప్పు ఒప్పుకోకపోతే మాత్రం వారిపై పెంపుడు కుక్కలను వదలాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... కొడాలి నాని ఇచ్చిన డబ్బును కొందరు ఓటర్లకు పంచకుండా తమ వద్దే ఉంచుకొని జల్సాలు చేయడానికి, విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేత సర్దార్ బేగ్. అందువల్ల.. ఆ డబ్బులు కాజేసిన వారందరినీ కల్యాణ మండపానికి పిలిపించి కొడాలి చిన్ని నిలదీయాలని సూచించారు. ఈ సమయంలో... నిజం చెప్పిన వారిని వదిలేసి డబ్బు వసూలు చేయాలని సూచించారు.

డబ్బు ఇవ్వని వారిపైకి పెంపుడు కుక్కలను వదిలేయాలని అన్నారు. ఈ సందర్భంగా... నమ్మక ద్రోహం చేసిన వారిలో 10, 11, 12 వార్డుల్లోని వారున్నారని సర్దార్ బేగ్ అన్నారు. వారిని వేగంగా పిలిచి డబ్బులు వసూలు చేయాలని.. లేదంటే వారిలో ఒకరు గోవా, ఇంకొకరు సింగపూర్, మరొకరు మలేషియా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు.

ఎన్నికల సమయంలో... ఎందుకూ పనికిరానోడి వద్ద కూడా రూ.50 వేల కట్టలు కనిపిస్తున్నాయి.. నాని గెలుపు కోసం కష్టపడిన మా కుర్రోళ్లను తిన్నారా..? లేదా..? అని అడిగినవారు లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో.. ఈ వ్యవహారంపై కొడాలి నాని & కో సీరియస్ గా ఉన్నారని అంటున్నారు.

Full View
Tags:    
  • Kodalinani 
  • Apelections 
  • Appolitics 
  • YSRCP 
  • Jaganmohanreddy 
  • Electionmoney 

Similar News

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

Copyright @2026

Powered by Blink CMS