• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బీఆరెస్స్ ఎంపీపై కత్తితో...

బీఆరెస్స్ ఎంపీపై కత్తితో దాడి... కడుపులో పొడిచిన దుండగుడు!

| దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని సూరంపల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి ఎంపీపై కత్తితో దాడి చేశాడు.

By - Tupaki Desk
Update: 2023-10-30 09:29 GMT

బీఆరెస్స్ నేత, మెదక్ ఎంపీ, ప్రస్తుత దుబ్బాయ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని సూరంపల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి ఎంపీపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి కడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అప్రమత్తమైన బీఆరెస్స్ కార్యకర్తలు హుటాహుటిన ప్రభాకర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు.

అవును... తాజాగా దుబ్బాక నియోజకవర్గంలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. ఎన్నికలు ప్రచారం నిర్వహిస్తోన్న ఎంపీపై దుండగుడు కత్తితో కడుపులో పొడిచాడు. దీంతో.. ఆ దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని బీఆరెస్స్ కార్యకర్తలు చితకబాదినట్లు తెలుస్తుంది.

అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఇక ఈ నిందితుడిని మిరుదొడ్డి మండలం చెప్పాల గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తిగా గుర్తించారని అంటున్నారు!

అయితే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి సంగతి తెలియగానే మంత్రి హరీష్‌ రావు ఫోన్‌ లో పరామర్శించిన అనంతరం హుటాహుటున మెదక్‌ బయల్దేరారు. ప్రస్తుతం గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతనిని.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని హరీష్ రావు సూచించారు. దీంతో ఆయన సూచనల మేరకు సికింద్రాబాద్ యశోద కు తరలిస్తున్నారని సమాచారం!

కాగా... గత ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి.. ప్రస్తుతం దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే బీఆరెస్స్ నుంచి బీఫాం అందుకున్న ఆయన.. ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఓ పాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా.. షేక్ హ్యాండ్ ఇస్తానని చెప్పి దగ్గరకొచ్చిన దుండగుడు ప్రభాకర్ రెడ్డి కడుపులో కత్తితో పొడిచాడు!

Knife attack on BRS MP Kotha Prabhakar Reddy#TelanganaElections2023 pic.twitter.com/gCSmV0cwkD

— 🅺🅳🆁 (@KDRtweets) October 30, 2023
Tags:    
  • Kothaprabhakarreddy 
  • Brsparty 
  • Medak 
  • Dubbaka 
  • Mla 
  • Knifeattack 
  • TelanganaElections 

Similar News

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

Copyright @2026

Powered by Blink CMS