• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కిమ్ కి రహస్య...

కిమ్ కి రహస్య ప్రియురాలు.. స్విట్జర్లాండ్ లో మొదలైన లవ్ స్టోరీ!

| అవును... ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్న తన కార్యక్రమాల్లో నిత్యం కనిపించే ఒక అమ్మాయికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-04-17 13:44 GMT

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కి సంబంధించి ఏ విషయం తెరపైకి వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... ఆయనకు ఒక రహస్య గర్ల్ ఫ్రెండ్ ఉందంటూ.. పలు కార్యక్రమాల్లో ఆమె కిమ్ జోంగ్‌ తో తరచుగా కనిపించే ఆమేనని.. ఆమె పేరు హ్యూన్ సాంగ్ వోల్ అని నెట్టింట ఒక ప్రచారం వైరల్ అవుతోంది.

 

అవును... ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్న తన కార్యక్రమాల్లో నిత్యం కనిపించే ఒక అమ్మాయికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కిమ్ జోంగ్‌ తో తరచుగా కనిపించే ఆమె అతని రహస్య స్నేహితురాలు అని ఒక వార్త తెరపైకి వచ్చింది! ఆమెకు సంబంధించిన ఫోటోలు మొదటిసారిగా వెలుగులోకి వచ్చాయి. ఆమె చాలా అందంగా కనిపిస్తుందనె కామెంట్లు సొంతం చేసుకుంటుంది.

 

కిమ్ జోంగ్ ఉన్ – హ్యూన్ సాంగ్ వోల్‌ ల ప్రేమకు గుర్తుగా ఒక బిడ్డ కూడా ఉన్నారని చెబుతున్నారు. ది మిర్రర్ నివేదిక ప్రకారం... హ్యూన్ సాంగ్ వోల్.. కిమ్ జోంగ్ ఉన్ ప్రైవేట్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో... కిమ్‌ తో కలిసి ఆమె అనేక ప్రదేశాలలో కనిపించిందని చెబుతున్నారు. వాస్తవానికి సింగర్ అయిన ఆమె... కిమ్ జోంగ్ ఉన్ ప్రైవేట్ కార్యాలయంలో పనిచేయడానికి ఆ వృత్తిని వదులుకుందని ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.

కిమ్ జోంగ్ ఉన్ రహస్య గర్ల్ ఫ్రెండ్ గా చెప్పే ఈమె... ఉత్తర కొరియాలోని ప్రముఖ గర్ల్ గ్రూప్ మోరన్‌ బాంగ్ బ్యాండ్‌ లో ఉండేవారంట. అయితే ఆమె అక్కడ తన బాధ్యతను వదిలిపెట్టి.. ఇప్పుడు కిమ్ ప్రైవేట్ కార్యాలయంలో పని చేస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే గత వారం ఆమె ప్యోంగ్యాంగ్‌ లో కిమ్‌ తో కనిపించడంతో ఈ విషయం ఒక్కసారిగా తెరపైకి వచ్చి హల్ చల్ చేయడం మొదలుపెట్టిందట.

ఈ క్రమంలో కిమ్ తన రహస్య గర్ల్ ఫ్రెండ్ తో జన్మనిచ్చిన బిడ్డ పేరు కిమ్ ఇల్ బాంగ్ అని మాజీ గూఢచారి ఒకరు వెల్లడించారని చెబుతున్నారు. ఇదే సమయంలో... కిమ్ భార్యకు పుట్టిన మొదటి కుమారుడు చాలా సన్నగా ఉండగా.. గర్ల్ ఫ్రెండ్ కి పుట్టిన కుమారుడు మాత్రం బలంగా ఉన్నాడని చెబుతున్నారంట.

ఇదే క్రమంలో ఆ మాజీ గూఢచారి చెబుతున్న వివరాల ప్రకారం... కిమ్, స్విట్జర్లాండ్‌ లో చదువుకుంటున్న సమయంలో హ్యూన్ ను కలిశాడని.. ఉత్తర కొరియాకు తిరిగి వచ్చిన తర్వాత వారి రిలేషన్ మరింత డెవలప్ అయ్యిందని చెబుతున్నారు. అయితే... కిమ్ తండ్రి మాత్రం ఆమె తో వివాహాన్ని అంగీకరించలేదని.. ఆ రిలేషన్ ని ముగించమని ఆదేశించాడని చెబుతున్నారు! అయితే తండ్రి మరణించిన తర్వాత కిమ్ తిరిగి ఆమెతో సంబంధాన్ని కొనసాగించాడని అంటున్నారు!

Tags:    
  • Southkorea 
  • KimjongUnakaKim 
  • HyonSongwol 
  • Pyongyang 
  • Convoy 
  • Politicalnews 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS