పెద్దారెడ్డికి పెద్ద క‌ష్టమే వ‌చ్చిందిగా.. !

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్ బ్రాండ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి మరో చిక్కులో పడ్డారు.;

Update: 2025-09-16 08:23 GMT

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్ బ్రాండ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి మరో చిక్కులో పడ్డారు. ఇప్పటికే ఆయన టిడిపి మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత జెసి ప్రభాకర్ రెడ్డితో నిత్యం వివాదాలను కొనసాగిస్తున్నారు. రెచ్చగొట్టేలాగా వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. దీంతో తాడిపత్రి నియోజకవర్గంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న చర్చ తరచుగా తెరమీదకు వస్తున్న విషయం తెలిసిందే. ఒకానొక దశలో తాడిపత్రికి రావడానికి కూడా పెద్దారెడ్డిని అనుమతించని విధంగా రాజకీయాలు మారిపోయాయి.

ఇద్దరూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నట్టుగా వ్యవహరించడం.. కార్యకర్తలపై దాడులు.. ప్రతిదాడులతో నాయకులు రెచ్చిపోవడం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమైన నియోజకవర్గాల్లో తాడిపత్రి మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పుడు సుప్రీంకోర్టు అనుమతితో తాడిపత్రిలోకి వచ్చే విధంగా పెద్దారెడ్డి చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆయనకు సంబంధించిన ఇంటిపై అధికారులు తాజాగా అక్రమ కట్టడం గా ముద్ర వేయడం మరో వివాదానికి దారితీసింది.

తాడిపత్రిలో పెద్దారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన ఇంటి విషయంలో ఆక్రమణల చోటుచేసుకున్నాయని ఫిర్యాదులు అందాయి. దీంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఆయన ఇంటిని సర్వే చేశారు. కొలతలు కూడా తీశారు. దీంతో సుమారు రెండు సెంట్లు మేరకు మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేశారని అధికారులు తేల్చారు. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ ఇంటి నిర్మాణాన్ని కూలగోడతారా లేకపోతే భారీ ఎత్తున జరిమానా వేసి క్రమబద్ధీకరిస్తారా అనేది చూడాలి.

ఇదిలా ఉంటే పెద్దారెడ్డి వాద‌న భిన్నంగా ఉంది. తన ఇంటిని అన్ని అనుమంతులతోనే నిర్మించాన‌ని, ఇది ఉద్దేశపూర్వకంగా జేసి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న రాజకీయమని, దీనిని బలంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని చెబుతున్నారు. వాస్తవానికి రాజకీయాలనేవి మాటలు వ‌రకే పరిమితం కావాలి. కానీ, సాధారణంగా తాడిపత్రిలో ఎప్పుడూ దాడులు ప్రతిదాడులకు దారితీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా స్థిరాస్తుల వరకు వివాదాలు చోటు చేసుకోవడం గ‌మ‌నార్హం.

ఆక్రమణల పేరుతో పెద్దారెడ్డి ఇంటిని కొలగొట్టే ప్రయత్నం చేయడం వంటివి మరింత వివాదంగా మారాయి. మరిది ఎటు దారి తీస్తుంది ఏం జరుగుతుంది అనేది చూడాలి. మరోవైపు పెద్దారెడ్డి పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పెద్దారెడ్డి ఈ చిక్కుల నుంచి ఎలా బ‌య‌ట ప‌డ‌తారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News