రాజ్ కసిరెడ్డితో టీడీపీ ఎంపీ బిజినెస్.. ట్విస్ట్ ఏంటంటే!
రాజ్ కసిరెడ్డి.. ఈ పేరు ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో మార్మోగిన విషయం తెలిసిందే.
రాజ్ కసిరెడ్డి.. ఈ పేరు ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో మార్మోగిన విషయం తెలిసిందే. వైసీపీ హ యాంలో లిక్కర్ కుంభకోణానికి పాల్పడిన తొలి నిందితుడిగా(ఏ1) రాజ్ కసిరెడ్డిని విచారణాధికారులు పేర్కొన్నారు. నిన్న మొన్నటి వరకు కూడా కసిరెడ్డి విజయవాడ జైల్లోనే ఉన్నారు. ఇటీవల షరతులతో కూడిన బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. అయితే.. ఈయనతో టీడీపీ ఎంపీకి సంబంధాలతో పాటు.. వ్యాపార బంధాలుగా ఉండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
రాజ్ కసిరెడ్డితో కలిసి విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని శివనాథ్ వ్యాపారాలు చేసినట్టు స్వయంగా ఎంపీనే చెప్పారు. రాజ్‌కసిరెడ్డికి చెందిన ఇశ్వానీ కంపెనీతో కేశినేని డెవలపర్స్ కలిసి పని చేసినట్టు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థగా ఏర్పడి వ్యాపార భాగస్వామిగా ఉన్నట్టు వివరించారు. తాజాగా ఎంపీ కేశినేని సతీమణికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున మీడియాలో చర్చ రావడంతో ఎంపీ స్పందించారు.
కసిరెడ్డితో కలిసి వ్యాపారాలు చేసిన మాట వాస్తవమేనన్నారు. అయితే.. 2022లో లిక్కర్ కుంభకోణం వెలుగు చూశాక.. ఆయనతో దూరం పాటిస్తున్నామన్నారు. ప్రస్తుతం .. తమకు, రాజ్ కసిరెడ్డికి మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయితే.. తాజాగా వచ్చిన నోటీసులు లిక్కర్‌కు సంబంధించినవిగా జరుగుతున్న ప్రచారాన్ని ఎంపీ తోసిపుచ్చారు. ఈ నోటీసులకు-వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ అక్రమాలకు సంబంధం లేదన్నారు.
గతంలో తాము రాజ్ కసిరెడ్డితో కలిసి వ్యాపారాలు చేసినప్పుడు.. 35 లక్షల రూపాయలకు ఒక ఆర్కిటెక్ట్‌కు బదిలీ చేశామన్నారు. దానికి సంబంధించిన లావాదేవీలపైనే ఈడీ అధికారులు తాజాగా నోటీ సులు ఇచ్చి నట్టు పేర్కొన్నారు. తన భార్య సదరు కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నట్టు వివరించారు. తాము అక్రమాలు, అన్యాయాలకు దూరంగా ఉంటామని.. ప్రజల సొమ్ముతినే రకం కాదని ఆయన వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.