• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేసీఆర్ సభకు నమస్కారమేనా...

కేసీఆర్ సభకు నమస్కారమేనా ?

| తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-12-08 16:42 GMT

తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. శీతాకాలం సమావేశాలుగా వీటిని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలలో కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు అనేక అంశాలు చర్చించాలని నిర్ణయించారు. అయితే ఈసారి సమావేశాలకు కేసీఅర్ వస్తారా రారా అన్నది కూడా ఆసక్తికరమైన చర్చగా ఉంది.

అసెంబ్లీకి కేసీఅర్ రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా కోరుకుంటున్నారు. అంతే కాదు ప్రతిపక్ష సీటు ఖాళీగా ఉండడం మంచిది కాదు అని ఆయన అంటున్నారు. కేసీఆర్ తన అనుభవంతో కూడిన సలహా సూచనలను ఇవ్వాలని ఆయన అంటున్నారు.

అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు కానీ బీఆర్ ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఅర్ వచ్చే అవకాశాలు అయితే ఈసారి కూడా ఉండకపోవచ్చు అని అంటున్నారు. కేసీఅర్ సభ కంటే జనాల్లోకి వెళ్ళడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన కొత్త ఏడాది జనవరి తరువాత జనంలోకి వెళ్తారు అని అంటున్నారు

అందుకే ఆయన తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సభలో ఎలా వ్యవహారించాలి అన్న దాని మీద దిశా నిర్దేశం చేశారు. ఇక సోమవారం నుంచి మొదలవుతున్న తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలలకు సంబంధించి బీఆర్ ఎస్ అజెండా ఎలా ఉండబోతోంది అన్నది కేసీఆర్ గజ్వేల్ జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ లో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ఏడాది కాంగ్రెస్ పాలన మీద విమర్శలు సంధించారు అని అంటున్నారు. ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ పాలన అన్ని విధాలుగానూ విఫలం అయింది అని ఆయన అంటున్నారు అందుకే ప్రతీ అంశాన్ని వదిలిపెట్టకుండా సభలో నిలదీయాలని తన పార్టీ ప్రజా ప్రతినిధులకు ఆయన సూచించారని తెలుస్తోంది.

అంతే కాదు విద్యారంగంలో ప్రభుత్వ వైఫల్యాలను సభలో ప్రస్తావించాలని కోరారు. అలాగే, గురుకుల పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితులను సైతం ఎండగట్టాలని అన్నారు. ఇక హాట్ హాట్ చర్చలో ఉన్న మూసీ సుందరీకరణ, హైడ్రా అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ కోరారని అంటున్నారు.

దీంతో కేసీఆర్ ఈసారి కూడా సభకు నమస్కారం పెట్టేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో ఇటీవలనే బడ్జెట్ సెషన్ ముగిసింది. దానికి విపక్ష నేత జగన్ హాజరు కాలేదు. తన పార్టీ వారిని కూడా పంపించలేదు. ఇక తెలంగాణాలో ఇపుడు అసెంబ్లీ అంటే అందరి ఫోకస్ కేసీఅర్ మీద పడుతోంది. కానీ ఆయన కూడా హాజరు అయ్యే చాన్సెస్ తక్కువ అంటున్నారు. మొత్తానికి విపక్ష నేతలు లేకుండానే రెండు చోట్లా అసెంబ్లీ సమావేశాలు జరుగడం ఒక అనావాయితీగా మారుతోందన్న మాట.

Tags:    
  • Kcr 
  • Brs 
  • Telanganaassembly 
  • Ktr 
  • Harishrao 
  • Congress 
  • Revanthreddy 
  • Telanganagovernment 
  • Bjp 

Similar News

మల్లారెడ్డి కోడలు.. మాట మార్చింది..

2026-11-13 07:17 GMT

'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!

2026-11-13 07:06 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ యూజర్లకు ఇబ్బందులు!

2026-11-13 06:51 GMT

కూటమిపై చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు.. స్థానికంలో వైసీపీ గెలుపుపై సీఎం కీలక వ్యాఖ్యలు!

2026-11-13 06:51 GMT

రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం.. 70 ఏళ్ల తర్వాత సంచలనం!

2026-11-13 04:43 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

ముచ్చటగా మూడో ఎఫైర్ బయటకు.. ఎన్విడియో 'హువాంగ్' ఏంటయ్యా ఈ యవ్వారాలు..

2026-11-13 04:11 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం....బీజేపీ ధీమా వెనక ?

2026-11-13 04:02 GMT

సోనియా ఆత్మ కధ....కాంగ్రెస్ కి ఎంత మేలు చేస్తుంది ?

2026-11-13 04:02 GMT

కొత్త పార్టీలు...వారికి అదో తుత్తి !

2026-11-13 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS