కవితకు కారు డోర్లు తెరచే ఉన్నాయా ?

తెలంగాణా రాజకీయాల్లో కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు అంటే ఆమె డాటర్ ఆఫ్ కేసీఆర్ కాబట్టి అంత ప్రాముఖ్యత.;

Update: 2025-09-03 02:30 GMT

తెలంగాణా రాజకీయాల్లో కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు అంటే ఆమె డాటర్ ఆఫ్ కేసీఆర్ కాబట్టి అంత ప్రాముఖ్యత. ఆమె ఒకసారి ఎంపీగా మరోసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆమె తెలంగాణా జాగృతి పేరుతో ఉద్యమ కాలంలో కొన్ని కార్యక్రమాలు చేసి ఉండవచ్చు కానీ ఆమె లీడర్ షిప్ క్వాలిటీస్ అయితే నిరూపించుకునేలా ఈ మొత్తం రాజకీయ ప్రయాణంలో బలమైన ముద్ర అయితే వేయలేకపోయారు అన్నది వాస్తవం. ఇక ఆమె మీద వేటు పడింది అన్న దాని మీద భూమీ ఆకాశం దద్ధరిల్లేలా చర్చలుసగుతున్నాయి అంటే ఆమె దిగ్గజ నాయకురాలా అని కాదు కేసీఆర్ కి పేగు బంధం అని అర్ధం చేసుకోవాలని అంటున్నారు.

కోలుకోలేని దెబ్బ తీశారా :

కవితను లైట్ తీసుకోవాలని మొదట్లో బీఆర్ఎస్ అధినాయకత్వం చూసింది. కానీ ఆమె మాత్రం తన మీద యాక్షన్ కి పెద్దలు దిగేంతవరకూ లాగారు ఆ సంగతి వారికి అర్ధమైనా ఎందుకులే వేటు అని కొంత తగ్గి వ్యవహరించారు చివరికి అదే కొంప ముంచింది అని అంటున్నారు. కవిత తాజాగా చేసిన ఆరోపణలు అయితే బీఆర్ఎస్ కూసాలే కదిలించాయి అని అంటున్నారు. ఆమె కేసీఆర్ దేవుడు అంటూనే తనకు ఆ పార్టీలో గిట్టని వారి మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు అవి చివరికి మొత్తం బీఆర్ఎస్ పార్టీకే చుట్టుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి జరిగింది అన్నది ఆమె డిక్లేర్ చేశారు అని అంటున్నారు. అది జనంలోకి చాలా వేగంగా వెళ్ళిపోయింది అని భావించిన మీదటనే ఆలస్యంగా మేలుకున్న బీఆర్ఎస్ అధినాయకత్వం ఆమె మీద వేటు వేసింది.

ఆమెకు మాత్రమే స్పెషల్ :

అయితే కవిత విషయంలో బీఆర్ఎస్ అధినాయకత్వం ఇంకా కొంత ప్రత్యేఅతను అభిమానాన్ని చూపించిందా అన్న చర్చ వస్తోంది. ఎందుకు అంటే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ మాత్రమే చేశారు. ఆమెను ఏకంగా బహిష్కరించలేదు. అలా బహిషించరించినట్లు అయితే ఆమె ఏ రోజునా తిరిగి పార్టీలో చేరే చాన్స్ ఉండేది కాదు అని అంటున్నారు. అందువల్ల ఆమెకు ఆ చాన్స్ ఇంకా ఇచ్చారు అని అంటున్నారు. ఎందుకంటే ఆమె కేసీఆర్ కుమార్తె కావడమే అని చెబుతున్నారు.

తప్పు తెలుసుకుంటేనే :

ఇక కవిత ఏదో ఆవేశంలో ఆగ్రహంతోనో తనకు తెలిసిన విషయాల మీద మాట్లాడుతూ సొంత పార్టీ వారి మీద తన కుటుంబీకుల మీద తీవ్ర విమర్శలు చేశారు. అవే నిజం అని ఆమె భావించడం వల్లనే ఘాటుగా వారి మీద విరుచుకుపడ్డారు. అయితే ఆమె తప్పు తెలుసుకుని కనుక తిరిగి వెనక్కి వేస్తే కారు డోర్లు తెరచి ఉండొచ్చు అన్న సంకేతాలను అయితే ఇచ్చేలాగానే సస్పెండ్ తో సరిపెట్టారా అన్న చర్చ ఉంది.

అగాధం పెరిగితే :

అయితే రాజకీయాల్లో విడిపోయినంత సులువుగా కలిసేది ఉండదు. మహారాష్ట్రలో చూస్తే దాదాపుగా ఇరవై ఏళ్ళ తరువాత థాక్రే బ్రదర్స్ తాజాగా కలిశారు. ఈ రెండు దశాబ్దాల పాటు ప్రత్యర్ధులు గానే మెలిగారు. ఇక ఏపీలో చూస్తే వైఎస్సార్ ఫ్యామిలీలో అన్నా చెల్లెలు కలహించుకుంటున్నారు. ఇపుడు అది కాస్తా బీఆర్ఎస్ కి పాకింది. ఆమె మనసు మార్చుకునేలోగానే ఆమె మీద బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడి గాయపరిస్తే ఆమె సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్ ముఖం చూడకపోవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ లో ఒక రాజకీయ సంక్షోభానికి మాత్రం కవిత కారణం కావడం విశేషం.

Tags:    

Similar News