కవిత కోరుకున్నదే కేసీఆర్ చేశారా ?

ఇలా ఒక సుదీర్ఘమైన పొలిటికల్ ఎపిసోడ్ గా సాగుతున్న బీఆర్ఎస్ వర్సెస్ కవిత అన్న పొలిటికల్ వార్ లో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అదే కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం.;

Update: 2025-09-02 13:30 GMT

గత మూడు నెలలుగా బీఆర్ఎస్ లో కవిత చిచ్చు సాగుతోంది. ఆమె పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది ఆమె చేస్తున్న ఆరోపణలు కానీ ఆమె పార్టీ అగ్ర నాయకుల మీద చేస్తున్న భారీ విమర్శలు కానీ బీఆర్ ఎస్ ని అతలాకుతలం చేస్తూ వచ్చాయి. ఇలా ఒక సుదీర్ఘమైన పొలిటికల్ ఎపిసోడ్ గా సాగుతున్న బీఆర్ఎస్ వర్సెస్ కవిత అన్న పొలిటికల్ వార్ లో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అదే కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం.

రెచ్చగొడుతూ వచ్చారా :

ఇదిలా ఉంటే కవిత ఒక విధంగా బీఆర్ఎస్ లో ఉండకూడదు అని అనుకున్నారా ఆ విధంగా భావించే బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని రెచ్చగొడుతూ వచ్చారా అన్న చర్చ సాగుతోంది. ఆమె ఈ ఏడాది మే నుంచి బీఆర్ఎస్ అధినాయకత్వం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా విరుచుకుపడుతూనే ఉన్నారు. పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం పదునుగా లేదని కవిత ఒక లేఖాస్త్రం సంధించడం ద్వారా కేసీఆర్ నే టార్గెట్ చేశారు అని అంటున్నారు. అంతే కాదు ఆమె కేసీఆర్ దేవుడు అంటూనే వెనకాల దెయ్యాలు ఉన్నాయని కీలక నేతలనే లక్ష్యంగా చేసుకున్నారు అని అంటున్నారు.

కోరి మరీ చేశారా :

ఇక ఆమె గత మూడు నెలలుగా తరచూ ప్రెస్ మీట్లు పెడుతూ కానీ కొన్ని ఎంపిక చేసుకున్న బీఆర్ఎస్ యాంటీ చానళ్ళలో కానీ ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆమెకు బీఆర్ఎస్ కి మరింత అగాధం సృష్టించాయి అని అంటున్నారు. బీఆర్ ఎస్ లైన్ ని ఆమె ఎపుడో దాటేశారు అని అంటున్నారు. పార్టీ విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి యాంటీగా ఉంటే ఆమె మాత్రం బీసీ రిజర్వేషన్ వంటి వాటి విషయంలో సంబరాలు చేసుకోవడం ద్వారా అధినాయకత్వాన్ని ప్రశ్నించారు అని అంటున్నారు. ఇక ఆమె బీఆర్ఎస్ లో తనకు తగిన స్థానం లేదని గ్రహించి వేరు పడాలని ఏనాడో నిర్ణయించుకుని ఇదంతా చేశారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.

పార్టీ వేటు వేయాలి :

ఇవన్నీ చూస్తూంటే కవిత ఎపుడో పార్టీకి దూరం కావాలని అనుకున్నారు అని అంటున్నారు. అయితే ఆ ప్రక్రియ చాలా ఆలస్యం జరిగింది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. నిజానికి బీఆర్ఎస్ లో మరో నేత అయితే ఈ విధంగా వ్యవహరించిన మొదటి రోజునే సస్పెండ్ చేసి ఉండేవారు అని అంటారు. కానీ కవిత కేసీఆర్ సొంత బిడ్డ కావడం వల్లనే ఆమె విషయంలో వేచి చూసారు అని అంటున్నారు. అయితే కవిత మాత్రం వేరు పడిపోవాలి అన్న ఆలోచనతోనే తెగే దాకా లాగారు అన్నది కూడా వినిపిస్తున్న మాట. ఆమె అలా పార్టీ నుంచే వేటు పడాలని కోరుకున్నారని దాని వల్లనే తనకు సానుభూతి దక్కుతుందని భావించి ఇలా చేశారు అని అంటున్నారు.

సానుభూతి కోసమేనా :

ఒక ఆడ బిడ్డను పార్టీలో చాలా కాలంగా ఉన్న మహిళను పార్టీ నుంచి పంపేశారు అన్న సానుభూతి తనకు దక్కుతుందని ఆమె భావించారా అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. అయితే సానుభూతి అయితే మొదట్లో ఆమెకు వచ్చేది కానీ ఇపుడు మూడు నాలుగు నెలలుగా ఆమె వైఖరి పార్టీనే ఇబ్బంది పెట్టేలా ఉండడంతో ఆమెకు ఇపుడు సింపతీ ఎంత మేరకు దక్కుతుంది అన్నది కూడా మరో చర్చగా సాగుతోంది. ఏది ఏమైనా కుమార్తె కవిత ఏదైతే కోరుకుంటున్నారో ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా కేసీఆర్ ఆమె కోరిక తీర్చారా అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి కవిత వర్సెస్ బీఆర్ఎస్ అసలైన ఎపిసోడ్ ముందు ముందు ఎన్ని రాజకీయ సంచలనాలు నమోదు చేస్తుందో.

Tags:    

Similar News