• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విద్వేష ఆయుధాన్ని బయటకు...

విద్వేష ఆయుధాన్ని బయటకు తీస్తున్న కవిత?

| ‘పోలవరం.. తెలంగాణపై ఖడ్గం’ పేరుతో నిర్వహించిన ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కవిత.

By - Tupaki Desk
Update: 2025-06-21 04:11 GMT

రాజకీయాలు గమ్మత్తుగా ఉంటాయి. కాలం చెల్లిన మాటల్ని సరికొత్తగా తెర మీదకు తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనాల్ని పొందాలనే ఎత్తుగడను చూస్తే.. తమ తెలివితేటల మీద నేతలకు ఉండే కాన్ఫిడెన్సు ఇంతనా? అన్న భావన కలుగక మానదు. ఇటీవల కాలంలో పార్టీ అధినేత చుట్టూ దెయ్యాలు చేరాయన్న సంచలన వ్యాఖ్యలతో తెర మీదకు వచ్చిన కవిత.. కొత్త పార్టీ దిశగా అడుగులు పడుతున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఆమె అంచనాలకు తగ్గట్లు ఆమె వ్యాఖ్యలకు స్పందన రాని వేళ.. ఆయన తన రూటును మార్చుకున్నారా? అన్నది ప్రశ్నగా మారింది.

గడిచిన పదేళ్లలో ఎప్పుడూ టచ్ చేయని అంశాల్ని.. తాజాగా తెర మీదకు తీసుకొస్తూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు కవిత. కాలం చెల్లిన ఆంధ్రా సెంటిమెంట్ మీద ఆమె ఆధారపడినట్లుగా ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. అయితే.. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థే.

‘పోలవరం.. తెలంగాణపై ఖడ్గం’ పేరుతో నిర్వహించిన ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. ‘‘పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏపీలో విలీనం చేసిన ఐదు ముంపు గ్రామాల్ని తిరిగి తెలంగాణకు ఇవ్వాల్సిందే. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నం.. క్రష్ణగుండాల.. ఎటపాక.. కన్నాయిగూడెం.. పిచ్చుకుల పాడు గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నారు. ఏ ప్రభుత్వం వారిని పట్టించుకోవటం లేదు. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే ఆ ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుంది. లేనిపక్షంలో బారీ వరదలొస్తే ఈ గ్రామాలన్నీ మునిగిపోతాయి. పోలవరంతో భధ్రాచటం ప్రాంతానికి శాశ్వతంగా ముప్పు పొంచి ఉంది’’ అంటూ వ్యాఖ్యానించారు.

తన తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలోనే ఐదు ముంపు గ్రామాల్ని ఏపీలో కలపటం.. కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయం మీద ఏం చేసినా ఫలితం లేదని.. అది అయిపోన ముచ్చటగా కేసీఆర్ తేల్చేయటం తెలిసిందే. దగ్గర దగ్గర పదేళ్లు తన తండ్రి అధికారంలో ఉన్న వేళలో ముంపు గ్రామాలకు చెందిన ప్రజల గురించి ఒక్క రోజు కూడా మాట్లాడేందుకు టైం లేని కవితకు.. ఇప్పుడు హటాత్తుగా వారు ఎందుకు గుర్తుకు వచ్చినట్లు?

నిజంగా ముంపు గ్రామాల ప్రజల మీద కవితకు అంత అభిమానమే ఉండి ఉంటే.. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వకల్తా ఎందుకు పుచ్చుకోలేదు? తండ్రి అధికారం దూరమై ఏడాది తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళలో కానీ ముంపు గ్రామాల గురించి గుర్తుకు వచ్చిందా? అన్నది ప్రశ్న. అప్పట్లో తమ చేతికి ఆయుధంగా మారిన ఆంధ్రా వ్యతిరేక వాదనను తాజాగా తెర మీదకు తీసుకురావటం ద్వారా మరో శక్తిగా ఎదగాలన్న కవిత ఆత్రుతను అర్థం చేసుకోవచ్చు. తన రాజకీయ ప్రయోజనాల కోసం సెంటిమెంట్ ను రగిల్చి.. రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవటం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇప్పటికీ కాలం చెల్లిన సెంటిమెంట్ ఆయుధాల్ని పట్టుకునే కన్నా..ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలు.. వాటికి పరిష్కారాల మీద ఫోకస్ చేస్తే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుందన్న విషయం కవితకు ఎప్పుడు అర్థమవుతుందో?

Tags:    
  • Kavitha 
  • Polavaram 
  • TelanganaPolitics 
  • AndhraTelangana 
  • SentimentPolitics 
  • MergedVillages 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS