బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ కి రంగం సిద్ధం ?

గత ఇరవై నాలుగు గంటలుగా తెలంగాణా రాజకీయాలలో ఒకే ఒక అంశం మీద చర్చ సాగుతోంది.;

Update: 2025-05-23 14:00 GMT

గత ఇరవై నాలుగు గంటలుగా తెలంగాణా రాజకీయాలలో ఒకే ఒక అంశం మీద చర్చ సాగుతోంది. బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ, కేసీఅర్ కుమార్తె అయిన కవిత ఏకంగా తన తండ్రి రాజకీయ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ లేఖను సంధించడం మీద పెద్ద ఎత్తున సర్వత్రా చర్చ సాగుతోంది.

ఇక సోషల్ మీడియాలో అయితే ఇదే ట్రెండింగ్ టాపిక్ గా ఉంది. బీఆర్ ఎస్ కి ఈ ఏడాదితో పాతికేళ్ళు నిండుతున్నాయి. ఇంత సుదీర్ఘ కాలం ఒక ప్రాంతీయ పార్టీ మనుగడ సాగించడం విశేషం. అలాగే పదేళ్ళ పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండడం కూడా గొప్ప విషయం.

మరో వైపు చూస్తే బీఆర్ఎస్ మరో సారి అధికారంలోకి రావడానికి చూస్తోంది. ఓటమి పాలు అయిన తరువాత కిందా మీదా పడుతున్న వేళలో కేసీఆర్ మీద సొంత కుమార్తె లేఖ రూపంలో కత్తులు దూస్తున్న నేపథ్యం ఉంది. దాంతో ఇపుడు బీఆర్ఎస్ పార్టీలో అంతటా ఒక సైలెంట్ వాతావరణం కనిపిస్తోంది.

కవిత పేరు మీద లేఖ వెలువడింది. అయితే ఆ లేఖ తానే రాసినట్లుగా కవిత అయితే ఎక్కడా స్పందించలేదు. అలాగే కాదు అని కూడా చెప్పలేదు. ఇక కేసీఆర్ కానీ కేటీయార్ కానీ హరీష్ సహా ఇతర నేతలు కానీ ఈ లేఖ విషయంలో పూర్తి మౌనం పాటిస్తున్నారు.

దాంతో పాటు అసలు ఈ లేఖ ఇపుడే ఎందుకు రిలీజ్ అయింది అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఈ లేఖ కావాలనే ఈ సమయంలో రిలీజ్ చేశారా దీని వెనక ఉద్దేశ్యాలు ఏమై ఉంటాయన్నది కూడా చర్చిస్తున్నారు. ఇంకో వైపు చూస్తే కేసీఆర్ మే టార్గెట్ చేస్తూ ఈ లేఖ కవిత రాయడంతో ఆమె ఈ లేఖ విడుదల అయి ఇరవై నాలుగు గంటల సమయం కూడా కావడంతో ఇక తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధపడ్డారా అన్న చర్చ కూడా వస్తోంది.

ఇంకో వైపు చూస్తే కవిత విదేశాల నుంచి హైదరాబాద్ కి వస్తున్నారని ఆమె వచ్చాకనే రాజకీయం మరింత పండుతుందని అంటున్నారు. ఆమె వచాక మీడియా ముఖంగా అయినా స్పందిస్తారు అని కూడా అంటున్నారు. ఇక చూస్తే బీఆర్ ఎస్ అధినాయకత్వం కవిత లేఖ రాసిన దానికి ఆమె నుంచి సంజాయిషీ కోరుతూ ఒక షోకాజ్ నోటీసు ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది.

అంతే కాదు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అని కూడా అంటున్నారు. అయితే మరో ప్రచారం ఏమిటి అంటే ఆమెనే పార్టీకి రాజీనామా చేయమని కోరుతారు అని అంటున్నారు. ఇందులో ఏది జరిగినా తెలంగాణాలో రాజకీయ కాక వేరే లెవెల్ లో ఉంటుంది అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే కవిత విషయంలో గులాబీ పార్టీలో ఇపుడు పూర్తి సైలెంట్ వాతావరణం ఉంది. కానీ అది తుపాను ముందు నిశ్శబ్దం అని అంటున్నారు. గులాబీ పార్టీలో సీరియస్ డెసిషన్స్ తీసుకుంటారు అని అంటున్నారు. మరి కవిత అన్నింటికీ సిద్ధపడే ఉన్నారా అన్నది కూడా చర్చగా ఉంది.

ఇక చూస్తే కనుక కేసీఆర్ కేటీఆర్ తదితర కుటుంబం అంతా అమెరికా టూర్ కి త్వరలో వెళ్లబోతున్నారు అని అంటున్నారు. అమెరికా వెళ్ళేలోగానే కవిత వ్యవహారంలో ఏదో ఒకటి తేల్చుతారని అంటున్నారు. జరుగుతున్న ప్రచారం చూస్తూంటే మే 26లోగా ఏదో ఒక సమయంలో కవిత మీద పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది అని అంటున్నారు. అంటే మరో ఇరవై నాలుగు గంటల వ్యవధి అన్న మాట. చూడాలి మరి బీఆర్ఎస్ లో ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News