మళ్లీ తెరపైకి 'కచ్చతీవు'.. ఆ పథకంతో సిద్ధంగా ఉన్నామన్న స్టాలిన్.
తమిళనాడు ఎన్నికలకు ‘కచ్చతీవు’కు విడదీయ లేని సంబంధం ఉందని అందరికీ తెలిసిందే.;
తమిళనాడు ఎన్నికలకు ‘కచ్చతీవు’కు విడదీయ లేని సంబంధం ఉందని అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు ఈ అంశం అక్కడి రాజకీయ పార్టీలకు మంచి బూస్ట్‌నిస్తుంది. గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఈ దీవి ప్రధాన రాజకీయ అస్త్రంగా మారింది. ఈ సారి లోక్‌సభ ఎన్నికలు తమిళనాడులో డీఎంకే వర్సెస్ బీజేపీగా సాగాయి. బీజేపీ స్థానిక సమస్యలకంటే జాతీయ స్థాయిలో సమస్యలను ముందుంచుతుంది. అందులో భాగంగా ‘కచ్చతీవు’ టాపిక్ ఎత్తుకుంది. ఇది ఆ సమయంలో బీజేపీకి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేందుకు ఎంతో కొంత దోహదం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దీవి గురించి ఇటీవల మైలాదుత్తురైలో నిర్వహించిన సభలో సీఎం స్టాలిన్ ప్రస్తావనకు తెచ్చారు. ‘ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని కానీ కేంద్రం ఎలాంటి సపోర్ట్ ఇవ్వడం లేదని ఆరోపించారు.’ దీంతో మళ్లీ ఈ ద్వీపంపై వచ్చింది.
‘కచ్చతీవు’ కథేంటి..?
కచ్చతీవు గురించి చాలా వరకు తెలిసే ఉంటుంది. కానీ టూకీగా తెలుసుకుందాం. ఇండియా-శ్రీలంక మధ్య ఉన్న చిన్న ద్వీపమే ‘కచ్చతీవు’. తమిళనాడు సముద్ర తీరంలో ఉన్న రామేశ్వరం నుంచి 10 నాటికన్ మైళ్ల దూరం, శ్రీలంకలోని జాఫ్నాకు 10.5 నాటికన్ మైళ్ల దూరంలో ఈ దీవి ఉంటుంది. ఇది మొదటి నుంచి భారత్ కు చెందిన దీవినే. దీని పొడవు 1.7 కిలో మీటర్లు.. ఉండగా వెడల్పు 300 మీటర్లు. ఇక్కడ సెయింట్ ఆంథోని ప్రార్థనా మందిరం (చర్చి) ఉంది. తమిళనాడు ప్రజలు ఈ చర్చిలో ఏటా ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉత్సవాలు చేస్తారు.
దీవి చుట్టూ మత్స్య సంపద ఎక్కువగా ఉండడంతో అక్కడ తమిళనాడుకు చెందిన జాలర్లు చేపల వేట సాగిస్తారు. 1974లో భారత ప్రధాని ఇందిరా, శ్రీలంక ప్రధాని సిరిమావో మధ్య కుదిరిన ఒక ఒప్పందంతో ఈ దీవి శ్రీలంక హస్తగతమైంది. కానీ చర్చిలో ఉత్సవాలు చేసుకోవచ్చని, జాలర్లు కూడా చేపలు పట్టుకోవచ్చని శ్రీలంక ఒప్పుకుంది. రెండేళ్ల తర్వాత (1976) మరో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం తమిళ జాలార్లు ఇక్కడ చేపలు పట్టద్దని శ్రీలంక తరిమివేసింది. తమకూ దీవిలో హక్కు ఉందని చెప్పినా అక్కడి సైన్యం వినడం లేదు. పడవలను కూడా శ్రీలంక సైన్యం ధ్వంసం చేస్తుంది.
తమిళనాడు నాయకులు అప్పటి యూపీఏ ప్రభుత్వంతో పొత్తులో ఉండి కూడా ద్వీపాన్ని పోగొట్టుకొని మత్స్య కారులను రోడ్డున పడేశారని బీజేపీ వాదిస్తోంది. కానీ మోడీ ప్రభుత్వం 15 ఏళ్లుగా ఏమీ చేయడం లేదని స్టాలిన్ వాదిస్తున్నాడు. అప్పగింత సమయంలో పార్లమెంట్ ఆమోదం లేదని ఇప్పుడు ఆ దీవిని భారత్ స్వాధీనం చేసుకోవచ్చని నిపుణులు వాదిస్తున్నారు.
ఏది ఏమైనా ఆ దీవి విషయంలో భారత్ వేగంగా స్పందిస్తుందని, తమిళ జాలార్లు నమ్మకంతో ఉన్నారు. ప్రతీ సారి ఎన్నికల అస్త్రంగా కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చూడాలని తమిళులు కోరుతున్నారు.