టీవీకే నేత అరెస్ట్... విచారాణాధికారి విషయంలో సర్కార్ కీలక నిర్ణయం!

అవును... కరూర్ లో టీవీకే పార్టీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో విచారణాధికారిగా ఉన్న డీఎస్పీని తొలగించిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో ఏడీఎస్పీ ప్రేమానందన్‌ ను నియమించింది.;

Update: 2025-09-30 04:02 GMT

తమిళనాడులోని కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 41 పెరిగింది! ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విచారణాధికారిగా ఉన్న డీఎస్పీని తొలగించి ఆయన స్థానంలో అడిషనల్ డిప్యూటీ ఎస్పీ(ఏడీఎస్పీ) ప్రేమానందన్‌ ప్రభుత్వం నియమించింది. అరెస్టులు మొదలు పెట్టింది!

అవును... కరూర్ లో టీవీకే పార్టీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో విచారణాధికారిగా ఉన్న డీఎస్పీని తొలగించిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో ఏడీఎస్పీ ప్రేమానందన్‌ ను నియమించింది. ఆయన ప్రస్తుతం కరూర్‌ తొక్కిసలాట కేసులో కొత్త దర్యాప్తు అధికారిగా నియమితులయ్యి.. సోమవారం బాధ్యతలు స్వీకరించగానే కేసుపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా కరూర్‌ లో టీవీకే సభ జరిగిన స్థలాన్ని పరిశీలించారు.

తొక్కిసలాట జరగడానికి గల కారణాల్లో టీవీకే సభ్యుల నిర్లక్ష్యం ఉందని, ఆ పార్టీ అధినేత విజయ్‌ కావాలనే సభకు ఆలస్యంగా వచ్చారనే అభియోగాల్ని పోలీసులు మోపారు. ఈ నేపథ్యంగా కరూర్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ లో 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కరూర్‌ జిల్లా టీవీకే కార్యదర్శి మదియళగన్‌ ను సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.

ఇదే సమయంలో... ఆయనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సీటీఆర్‌ నిర్మల్‌ కుమార్‌ లను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో వారిని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జనాలు రద్దీ పెరుగుతుండటంతో ముప్పు పొంచి ఉందని తామెంత చెప్పినా పార్టీ ప్రముఖులు పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు ఈ దుర్ఘటనపై విచారణకు నియమించిన ఏకసభ్య కమిషన్‌ పని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా... జస్టిస్‌ అరుణా జగదీశన్‌ వరుసగా రెండోరోజు కరూర్‌ లో విచారణ చేపట్టారు. మరోసారి దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని కలిసి, ఘటన రోజు ఏం జరిగిందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Tags:    

Similar News