• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేఏ పాల్ ఫస్ట్రేషన్...

కేఏ పాల్ ఫస్ట్రేషన్ పీక్స్.. విశాఖలో సీఐ కాలర్ పట్టుకొని ఆగ్రహం

| ఆయన్ను అడ్డుకోబోయిన సీఐ రామారావు కాలర్ పట్టుకొన్న కేఏ పాల్ తీరు షాకింగ్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2023-08-30 04:31 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్ హాట్ గా మారిన వేళ.. ఆ వేడిని తగ్గించే విషయంలో కేఏ పాల్ వ్యాఖ్యలు.. ఆయన చేష్టలు ఉంటాయన్న మాట రాజకీయ వర్గాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఆయన చెప్పే మాటలు ఆసక్తిగా వినేందుకు.. ఆయన వీడియోలు చేసేందుకు ఆసక్తిని వ్యక్తమవుతుంటుంది. అయితే.. ఆయన్ను సీరియస్ గా తీసుకునే విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. తాజాగా విశాఖలో ఆయన వేసిన వీరంగం చూస్తే మాత్రం హద్దులు దాటినట్లుగా అనిపించక మానదు.

మొన్నటికి మొన్న హైదరాబాద్ లోని తన ఇంటి ముందు గుంతలు తవ్వుతున్న ఉద్యోగుల మీద నోరు పారేసుకున్న కేఏ పాల్.. తాజాగా విశాఖలో నిర్వహించిన ఆందోళనను భగ్నం చేసిన పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు,

ఆయన్ను అడ్డుకోబోయిన సీఐ రామారావు కాలర్ పట్టుకొన్న కేఏ పాల్ తీరు షాకింగ్ గా మారింది. పోలీసులు తన చేతులు.. కాళ్లు విరగ్గొట్టారని.. దీక్ష 24 గంటలు గడవకముందే.. భగ్నం చేసినట్లుగా ఆరోపించారు.

ఏపీలో రాక్షస పాలన సాగుతోందని.. తక్షణమే సీఐ రామారావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తన చావు కోసం రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నట్లు చెప్పిన ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదని.. నష్టాలు వచ్చేట్లు చేస్తున్నారన్నారు. మిగిలిన రాజకీయ వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్నా.. పోలీసు అధికారి కాలర్ పట్టుకున్న ఉదంతంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపేయాలంటూ రెండు రోజుల క్రితం అల్టిమేటం ఇవ్వటం.. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో.. నిరవధిక దీక్ష చేపట్టటం తెలిసిందే. ఈ నిరసనను అడ్డుకునే సందర్భంలో పోలీసులపై విరుచుకుపడిన ఆయన తీరు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    
  • Kapaul 
  • Telugustates 
  • Ciramarao 
  • Collar 
  • Hyderabad 
  • Andhrapradesh 
  • Vishaka 
  • Politics 
  • Politicalnews 

Similar News

వ్య‌క్తులు కాదు.. విధానాల‌తోనే వైసీపీ హ‌వా.. !

2026-11-11 23:30 GMT

టీడీపీలో 'రోజులు' మారాయ్‌.. !

2026-11-11 22:30 GMT

సీమ ఓట్లు ప‌డాలంటే... ఆ 3 జిల్లాలే ముఖ్యం.. !

2026-11-11 19:30 GMT

సోనియా ఆత్మ‌కథ‌: జ‌నాల్లో క్రేజ్ ఎలా ఉందంటే!

2026-11-11 18:30 GMT

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత స‌త్తా చాటేనా?

2026-11-11 17:30 GMT

సోనియా గాంధీ ఒక స్పై.. ఆమె రాగానే గాంధీ కుటుంబంలో హత్యలు.. కంగన సంచలన ఆరోపణలు

2026-11-11 16:47 GMT

షర్మిలమ్మను మురిపించిన సోనియమ్మ

2026-11-11 16:45 GMT

సాయి రెడ్డి పీఆర్‌పీ.. కొన్ని కీల‌క 'గ‌మ్మ‌త్తులు'.. !

2026-11-11 16:41 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

Copyright @2026

Powered by Blink CMS