పాక్ పై కంగనా కామెంట్స్ వైరల్... తెరపైకి చేతికి గాజులు!

ఈ సందర్భంగా... ప్రతిపక్ష నేతలు అంటున్నారు.. పాకిస్తాన్ గాజులు తొడుక్కుని కూర్చోలేదని.. "అరే భాయ్, నహీ పెహ్నీ హై టు హమ్ పెహ్నా డెంగే (పాకిస్తాన్ గాజులు ధరించడం లేదని వారు అంటున్నారు..

Update: 2024-05-17 06:02 GMT

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటం.. మరోపక్క వీవోకే లో ఉధ్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎన్నికల ప్రచారంలో ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు భారత్ ఎన్నికల్లో పాకిస్థాన్ ప్రస్థావన వైరల్ గా మారుతుంది. పైగా ఎన్నికలు సమీపించాయంటే పాక్ అంశం బీజేపీ కచ్చితంగా ఒక ప్రధాన అస్త్రం అనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... ఈసారి కంగనా రనౌత్ కామెంట్స్ వైరల్ గా మారాయి!

అవును... భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో రచ్చ జరుగుతుండటం.. అక్కడున్న ఉద్యమకారులు భారత్ జోక్యాన్ని కోరుకోవడం ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... పీఓకేను భారత్ స్వాధీనం చేసుకుంటుందంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఇటీవల ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, వారు గాజులు తొడుక్కుని లేరని అన్నారు.

ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కంగనా రనౌత్... ప్రస్తుతం పీవోకే లో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో పాటు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటామంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, దానికి విపక్ష నేతలు వేస్తున్న సెటైర్స్ పై స్పందించారు. ఇందులో భాగంగా... "పాకిస్తాన్‌ కు ఆటా, విద్యుత్ అవసరమని మాకు తెలుసు.. కానీ దాని వద్ద గాజులు కూడా లేవని మాకు తెలియదు" అని అన్నారు.

ఈ సందర్భంగా... ప్రతిపక్ష నేతలు అంటున్నారు.. పాకిస్తాన్ గాజులు తొడుక్కుని కూర్చోలేదని.. "అరే భాయ్, నహీ పెహ్నీ హై టు హమ్ పెహ్నా డెంగే (పాకిస్తాన్ గాజులు ధరించడం లేదని వారు అంటున్నారు.. పాకిస్తాన్ గాజులు ధరించకపోతే, మేము వాటిని ధరించేలా చేస్తాము" అని వ్యాఖ్యానించారు.

కాగా... ఇటీవల బీహార్‌ లోని ముజఫర్‌ పూర్ లోక్‌ సభ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన మోడీ... "పాకిస్తాన్ గాజులు ధరించకపోతే, మేము ఆ దేశానికి వాటిని ధరించేలా చేస్తాం. వారికి ఆహారధాన్యాలు లేవని తెలుసు. ఇప్పుడు వారి వద్ద తగినంత గాజులు కూడా లేవని తెలుసు" అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News