ఒకే ఒక్కడుని కదపాల్సిందేనా...కూటమి డిమాండ్ వెనక ?

అలా ఏపీలో పోలింగ్ కి ముందు టీడీపీ కూటమి తాము అనుమానించిన అధికారుల మీద వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఆరోపించిన వారి మీద చర్యలకు డిమాండ్ చేసింది.

Update: 2024-05-23 17:35 GMT

టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వెనక చాలా వ్యూహాలు ఉన్నాయని అని ప్రచారం జరిగింది. అందులో భాగంగా ఎలక్షనీరింగ్ లో తమదే పై చేయిగా ఉండాలన్నది ప్రధానంగా ఉంది. ఇక చాలా చోట్ల అధికారుల బదిలీ కూడా జరిగింది. అలా ఏపీలో పోలింగ్ కి ముందు టీడీపీ కూటమి తాము అనుమానించిన అధికారుల మీద వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఆరోపించిన వారి మీద చర్యలకు డిమాండ్ చేసింది.

అలా వారు చెప్పినట్లుగా బదిలీలు జరిగాయి. ఇక పోలింగ్ కి వారం రోజులు ముందు ఉంది అనగానే ఏపీ డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి కూడా బదిలీ అయిపోయారు. ఆయన ప్లేస్ లో కొత్త డీజీపీ వచ్చారు. అపుడే ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి బదిలీని కూడా కూటమి డిమాండ్ చేసింది. కానీ అది జరగలేదు.

అయితే ఇప్పటికీ అదే డిమాండ్ మీద కూటమి నిలబడి ఉంది. ఆ పార్టీ నేతలు అంతా సీఎస్ ని తప్పించాల్సిందే అని అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు కూడా ఇదే కోరుతున్నారు. ఇక తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కనకమేడల రవీంద్రకుమార్ ఇదే డిమాండ్ చేశారు.

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని తొలగించాల్సిందే అని ఆయన కోరారు. ఆయన పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక సంఘటలను అదుపు చేయలేక పోయారు అని నిందించారు. హింసను ఆపడంలో సీఎస్ పూర్తిగా వైఫల్యం చెందారు అని కనకమేడల ఆరోపిస్తున్నారు. ఆయనను తొలగించకపోతే కౌంటింగ్ సమయంలోనూ పూర్తిగా ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు.

Read more!

అలాగే వైసీపీకి ఇంకా చాలా మంది పోలీస్ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని ఆయన విమర్శించారు. వారి మీద ఈసీ విచారణ జరపాలని దానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. మొత్తం మీద చూస్తే జవహర్ రెడ్డిని కదపాలని కూటమి చూస్తోంది.

ఈ డిమాండ్ గత రెండు నెలలుగా చేస్తూ వస్తోంది. అదిగో ఇదిగో సీఎస్ ని పక్కన పెడతారు అని వార్తలు వచ్చినా అవి ఉత్తవే అని తేలిపోయాయి. ఇపుడు చూస్తే పది రోజులలో కౌంటింగ్ ఉంది. దాంతో సీఎస్ ఉండరాదు అని కూటమి అంటోంది. మరి దీని మీద ఈసీ ఏమి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది.

ఏది ఏమైనా పోలింగ్ ఒక ప్రధాన ఘట్టం అయితే దానిని మించిన ఘట్టం గా కౌంటింగ్ ప్రక్రియ ఉంది. ఈసారికి చూస్తే చాలా చోట్ల ఎవరికి మెజారిటీలు భారీగా వచ్చే సీన్ లేదని అంటున్నారు. దాంతో ప్రతీ ఓటూ కీలకంగా మారుతుంది. దాంతో ఏ చిన్న పొరపాటు జరిగినా అభ్యర్థి ఓటమి అంచుల్లోకి వెళ్తారు.

దాంతో అన్నీ ఆలోచించుకున్న మీదటనే టీడీపీ సకల జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించినట్లుగా ఉంది అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ బదిలీలు పక్కన పెట్టడాలు అన్న ఆంక్షల నుంచి తప్పించుకుని సేఫ్ జోన్ లో జవహర్ రెడ్డి ఒకే ఒక్కడు గా ఇంతవరకూ ఉన్నారు. ఆయన మీద ఇపుడు సీరియస్ గానే ఫోకస్ పెట్టి తొలగిస్తారా అంటే వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News