‘ఆ స్థితిలో నేను లేను’... విజయ్ గురించి కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అవును... వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయం ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే.;
తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సారి ఎన్నికల్లో అధికార డీఎంకే, విపక్ష అన్నా డీఎంకేలతో పాటు సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పోటీ చేయబోతోంది. ఈ సమయంలో తమిళనాడు రాజకీయం మరింత ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా విజయ్ పాలిటిక్స్ కి సలహాలు ఇవ్వడంపై కమల్ హాసన్ ఆసక్తికరంగా స్పందించారు.
అవును... వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయం ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా విజయ్ టీవీకే పార్టీ ఎంట్రీతో ఇది మరింత రసవత్తరంగా మారిందని అంటున్నారు. మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి విజయేనని టీవీకే పార్టీ ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి అరుణ్ రాజ్ ఇప్పటికే వెల్లడించారు.
ఈ సమయంలో... కేరళలో నిర్వహించిన హార్టస్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్ కు నటి మజూ వారియర్ తో పాటు సెంట్రిస్ట్ పార్టీ మక్కల్ నీది మైయం (ఎంఎన్ఎం)పార్టీ వ్యవస్థాపకుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా... 2026లో నిర్వహించనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న విజయ్ కు ఏమైనా సలహాలిస్తున్నారా? అనే ప్రశ్నను ఎదుర్కొన్నారు కమల్.
దీనిపై స్పందించిన ఆయన... తాను సలహా ఇచ్చే స్థితిలో లేనని.. తాను ఎప్పుడూ సలహా తీసుకోలేదని.. బహుశా నా సోదరుడికి సలహా ఇవ్వడానికి ఇది సరైన సమయం కాకపోవచ్చని అన్నారు. ఇదే సమయంలో.. అనుభవం మన కన్నా గొప్ప గురువని.. అది నేర్పే పాఠాలు ఎవరూ నేర్పించలేరని.. మనుషులకు పక్షపాతం ఉండోచ్చు కానీ, అనుభవానికి అది ఉండదని కమల్ అభిప్రాయపడ్డారు.
ఇక.. ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ కొత్త సినిమా "జన నాయగన్". హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెత్తుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. మరోవైపు.. ఈ ఏడాది ప్రారంభంలో చివరిసారిగా మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే.