అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ కు ప్రాణాంతక క్యాన్సర్!
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రాణాంతక ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.;
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రాణాంతక ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. "గత వారం అధ్యక్షుడు జో బైడెన్ మూత్ర సంబంధిత లక్షణాలు పెరగడంతో ప్రోస్టేట్ గ్రంధిలో కొత్తగా కనుగొనబడిన ఒక గడ్డ కోసం పరీక్షించుకున్నారు. అందులో ప్రోస్టేట్ క్యాన్సర్ అని తేలింది" అని బైడెన్ కార్యాలయం నుండి వచ్చిన ప్రకటన పేర్కొంది. "శుక్రవారం పరీక్షల్లో గ్రేడ్ గ్రూప్ 5తో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది ఎముకలకు కూడా వ్యాపించింది" అని తెలిపారు. "ఇది వ్యాధి తీవ్రతను సూచిస్తున్నప్పటికీ, క్యాన్సర్ హార్మోన్-సెన్సిటివ్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది, ఇది సమర్థవంతమైన చికిత్సకు వీలు కల్పిస్తుంది" అని ప్రకటన తెలిపారు "అధ్యక్షుడు , అతని కుటుంబం వైద్యులతో చికిత్స కోసం సమీక్షిస్తున్నారు." అని పేర్కొన్నారు.
అధ్యక్షుడు బైడెన్ వయస్సు 82 సంవత్సరాలు. ఈ సంవత్సరం ప్రారంభంలో పదవీ విరమణ చేసే సమయానికి అమెరికాలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తర్వాత డొనాల్డ్ ట్రంప్ రెండవసారి వైట్ హౌస్‌లోకి ప్రవేశించి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఓడించారు.
"జో బైడెన్‌కు ఇటీవల వచ్చిన ప్రొస్టేట్ క్యాన్సర్ గురించి విని మెలానియా , నేను విచారించాము" అని అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌లో రాశారు. "జిల్‌కు , కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాము. జో త్వరగా విజయవంతంగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము" అని ఆయన పేర్కొన్నారు.
"జో బైడెన్ క్యాన్సర్‌ను జయించాలని ప్రార్థిస్తున్నాను" అని డెమొక్రాటిక్ చట్టసభ్యుడు రో ఖన్నా ఎక్స్‌లో రాశారు. "జోబైడెన్, జిల్ ఎప్పుడూ పోరాట యోధులు, వారు ఈ సవాలును ధైర్యంగా ఎదుర్కొంటారని నేను విశ్వసిస్తున్నాను" అని ఆయన అన్నారు.
అధ్యక్షుడు బైడెన్ పదవిలో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యంపై చాలా సందేహాలు ఉండేవి.. ఆయన మానసిక దృఢత్వం , చురుకుదనంపై ప్రశ్నలు తలెత్తాయి. అన్నట్టుగా ఆయనకు ఈ వ్యాధి సోకడంతో చాలా మంది డెమొక్రాట్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
అధ్యక్షుడు బైడెన్ తన కుమారుడు బ్యూ బైడెన్‌ను 2015లో క్యాన్సర్‌తో కోల్పోయారు. అప్పటి నుండి ఆయన క్యాన్సర్ నివారణ కోసం ఒక మూన్‌షాట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు, మొదట బరాక్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా , తరువాత 2021 నుండి అధ్యక్షుడిగా పనిచేశారు.