8 ఏళ్ల తర్వాత ప్రపంచంలోని రెండో కుబేరుడి పేరు మారింది.. ఎవరది?

అవును... సుమారు ఎనిమిది సంవత్సరాలుగా ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగిన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. తాజాగా ఆ స్థానాన్ని కోల్పోయారు.;

Update: 2025-06-14 12:30 GMT

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ రాసిన 'పాకుడు రాళ్లు' పుస్తకంలో సినీ నటుల జీవితాల్లోని ఎగుడు దిగుడులు, నిత్యం కనిపించే ఎత్తుపల్లాల గురించి, తెర వెనుక జీవితాల గురించి చెప్పినట్లుగానే.. అందరి జీవితంలోనూ పాకుడు రాళ్లు ఉంటాయని అంటుంటారు. అంటే.. ఓ గొప్ప స్థానానికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మరింత పైకి వెళ్లడం ఎంత ముఖ్యమో, ఉన్న స్థానాన్ని కాపాడుకోవడం అంతే ముఖ్యమని చెబుతారు.

ఈ సమయంలో ఆ వ్యక్తి జీవితం పాకుడు రాళ్లపై ప్రయాణం లాంటిదని అంటారు. ఇంత పెద్ద ఉపోద్ఘాతం ఎందుకంటే... ఈ ప్రపంచంలో సుమారు 750 కోట్ల మంది జనాభా ఉంటే.. అందులో టాప్ 10 ధనవంతుల జాబితాలో స్థానం సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు.. ఇందులో ప్రతీ ఒక్క స్థానమూ దేనికదే గొప్ప! కాపాడుకోవడం మరింత గొప్ప! ఈ క్రమంలో టాప్ 2 ప్లేస్ లో ఉండే జెఫ్ బెజోస్ ఆ స్థానాన్ని తాజాగా కోల్పోయారు.

అవును... సుమారు ఎనిమిది సంవత్సరాలుగా ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగిన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. తాజాగా ఆ స్థానాన్ని కోల్పోయారు. తాజాగా ఆ స్థానాన్ని ఒరాకిల్ కో-ఫౌండర్ లారీ ఎల్లిసన్ సొంతం చేసుకున్నారు. ఇందులో భాగంగా.. 243 బిలియన్ డాలర్ల సంపదతో లారీ ఎల్లిసన్ ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో నిలిచారు. తాజాగా ఫోర్బ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.

మే నెలతో ముగిసిన త్రైమాసికంలో ఒరాకిల్ అంచనాలను మించి లాభాలు సాధించిందని ఫోర్బ్స్ వెల్లడించింది! దీంతో కంపెనీ షేర్లు పుంజుకున్నాయి. ఈ క్రమంలో గురువారం ట్రేడింగ్ సెషన్ లో ఒకేసారి 13 శాతం పెరిగి ఫస్ట్ టైం 200 డాలర్ లకు చేరాయి. దీంతో.. ఒక్క రోజులోనే లారీ ఎల్లిసన్ సంపద 26 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఫలితంగా.. ఆయన మొత్తం సంపద ప్రస్తుతం 258 బిలియన్ డాలర్లకు చేరింది.

కాగా... ఈ జాబితాలో 410.8 బిలియన్ డాలర్ల సంపదతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టాప్ 10 కుబేరుల జాబితాను ఒకసారి పరిశీలిద్దామ్..!

1. ఎలాన్ మస్క్ - 410.8 బిలియన్ డాలర్లు

2. లారీ ఎల్లిసర్ - 258.8 బిలియన్ డాలర్లు

3. మార్క్ జుకర్ బర్గ్ - 235.7 బిలియన్ డాలర్లు

4. జెఫ్ బెజోస్ - 226.8 బిలియన్ డాలర్లు

5. వారెన్ బఫెట్ - 152 బిలియన్ డాలర్లు

6. లారీ ఫేజ్ - 144.7 బిలియన్ డాలర్లు

7. బెర్నార్డ్ ఆర్నాల్డ్ & ఫ్యామిలీ - 141.5 బిలియన్ డాలర్లు

8. సెర్గీ బ్రీన్ - 138.4 బిలియన్ డాలర్లు

9. స్టీవ్ బాల్మెర్ - 136.2 బిలియన్ డాలర్లు

10. జెన్సెన్ హువాంగ్ - 123.9 బిలియన్ డాలర్లు

Tags:    

Similar News