• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్విస్ట్ ఇచ్చిన జనసేన.....

ట్విస్ట్ ఇచ్చిన జనసేన.. కిరణ్ రాయల్ ఒంటరేనా?

| తిరుపతి జనసేన ఇన్ చార్జి కిరణ్ రాయల్ విషయంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

By - Tupaki Desk
Update: 2025-02-10 08:22 GMT

తిరుపతి జనసేన ఇన్ చార్జి కిరణ్ రాయల్ విషయంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ నేతలను ఆదేశిస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ పూర్తయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాగా, కిరణ్ రాయల్ తనలా ఎంతో మంది మహిళలను మోసం చేశారని బాధితురాలు మరోమారు ఆరోపణలు గుప్పించారు.

జనసేన పార్టీ తిరుపతి ఇన్ చార్జి కిరణ్ రాయల్ కు పార్టీ షాక్ ఇచ్చింది. కోటి రూపాయల నగదు, బంగారం తీసుకుని కిరణ్ రాయల్ తనను మోసం చేశారని తిరుపతికి చెందిన ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. కిరణ్ రాయల్ తనను ఎలా వంచించాడో వివరిస్తూ ఆ మహిళ విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. మహిళలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఇప్పుడు ఏం చేస్తారో చెప్పాలని ప్రతిపక్షం నిలదీసింది. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు.

కిరణ్ రాయల్ విషయంలో వాస్తవాలు తెలుసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న విషయం తెలియజేయాలని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చాటి చెప్పాలని నిర్ణయించారు. సమాజానికి ప్రయోజనం లేని విషయాలను పక్కనపెట్టి ప్రజలకు ఉపయోగ పడే కార్యక్రమాలపై పార్టీ నేతలు దృష్టి పెట్టాలని సూచించారు.

పార్టీ నిర్ణయంతో కిరణ్ రాయల్ కు దెబ్బ పడినట్లైంది. జనసేన ఆవిర్భావం నుంచి కిరణ్ రాయల్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీపై విమర్శలు చేయడంలో ముందుంటారు. ఇటీవల జగన్ 2.0 స్టేట్మెంట్ పైనా కిరణ్ రాయల్ విమర్శలు హైలెట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఆరోపణలు రావడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది.

2013లో కిరణ్ రాయల్ తన వద్ద డబ్బు తీసుకున్నాడని మహిళ ఆరోపిస్తుండగా, తాను ఆ డబ్బు ఎప్పుడో ఇచ్చేశానని అందుకు తగిన ఆధారాలు, వీడియో రికార్డులు తన వద్ద ఉన్నాయని కిరణ్ రాయల్ చెబుతున్నాడు. ఈ అంశంపై కోర్టులో తేల్చుకుంటానని ఆయన మీడియాకు తెలిపాడు. అయితే బాధిత మహిళ మాత్రం కిరణ్ రాయల్ వాదనను తోసిపుచ్చుతోంది. తన డబ్బు అడిగితే బెదిరిస్తున్నట్లు వాపోతోంది. కిరణ్ రాయల్ నుంచి రక్షించాలని కోరుతోంది. లేదంటే తనకు చావే శరణ్యమని వాపోతోంది. సోమవారం కూడా తిరుపతిలో మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు కిరణ్ రాయల్ ఎంతో మంది మహిళలను మోసం చేశాడని ఆరోపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనకు న్యాయం చేయాలని కోరింది.

Tags:    
  • PawanKalyan 
  • KiranRoyal 
  • Janasena 
  • APPolitics 
  • TirupatiJanasenaIncharge 
  • KiranRoyalPolitics 
  • Apdeputycm 
  • Chandrababu 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS