• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బీకాంలో ఫిజిక్స్ జలీల్...

బీకాంలో ఫిజిక్స్ జలీల్ ఖాన్ ఫైర్...కారణం క్లియర్!

| ఈ నేప‌థ్యంలో పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ టికెట్ టీడీపీకే వస్తే... మ‌రోసారి జ‌లీల్‌ ఖాన్ పోటీచేయాలని భావిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-12-11 09:11 GMT

గత రెండు రోజులుగా విజ‌య‌వాడ టీడీపీలో టికెట్లపై రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నుంచి తాను బ‌రిలో వుంటాన‌ని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన త‌న‌కు చంద్రబాబు టికెట్ ఇస్తార‌ని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని అంటూనే తన వాయిస్ ని గట్టిగా వినిపించారు

ఈ సమయంలో ఇదే టికెట్‌ ను ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జ‌లీల్‌ ఖాన్ తీవ్రస్థాయిలో స్పందించారు. గ‌తంలో వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీలో చేరిన జలీల్ ఖాన్... బీకాంలో ఫిజిక్స్ చ‌దివిన నాయ‌కుడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫుల్ పాపులర్ అయిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో ఈయ‌న కుమార్తె ష‌బానా ఖాతూన్ విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి.. వైసీపీ నేత వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ చేతిలో ఓడిపోయారు.

ఈ నేప‌థ్యంలో పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ టికెట్ టీడీపీకే వస్తే... మ‌రోసారి జ‌లీల్‌ ఖాన్ పోటీచేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తనకు కానీ, తన కుమార్తె కు గానీ టిక్కెట్ కన్ ఫాం అని భావిస్తున్నారు. ఈ క్రమంలో సడన్ గా ప్రెస్ మీట్ పెట్టిన బుద్ధా వెంక‌న్న... రాబోయే ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ టిక్కెట్ తనకే ఇవ్వాలని అన్నారు. నమ్మకస్తులకే చంద్రబాబు టిక్కెట్ ఇస్తారని చెప్పుకొచ్చారు

దీంతో... జ‌లీల్‌ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఇందులో భాగంగా... క‌నీసం కార్పొరేట్ స్థానానికి కూడా పోటీ చేయ‌డానికి ప‌నికి రానివాళ్లు టికెట్ ఆశించ‌డం ఏంట‌ంటూ మండిప‌డ్డారు. ముందు త‌న స్థాయి ఏంటో చూసుకోవాల‌ని గ‌ట్టిగా చీవాట్లు పెట్టారు. దీంతో విజయవాడ వెస్ట్ టిక్కెట్ టీడీపీలో పెద్ద తలనొప్పిగానే మారేట్లు ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి

ఇదే సమయంలో... వార్నింగులు అయిపోయిన అనంతరం రానున్న ఎన్నిక‌ల్లో తాను ఎమ్మెల్యేగా, కేశినేని చిన్ని ఎంపీగా పోటీ చేస్తామ‌ని చెప్పేస్తున్నారు జలీల్ ఖాన్. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను, ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పోటీ చేస్తార‌ని.. అది త‌న మాట కాద‌ని, చంద్రబాబు చెప్పార‌ని జ‌లీల్‌ ఖాన్ చెప్పుకొచ్చారు. దీంతో విజ‌య‌వాడ టీడీపీలో రాజ‌కీయం వేడెక్కింది.

కాగా... విజయవాడ వెస్ట్ టిక్కెట్ బీసీకిస్తే తనకు.. ముస్లింకి ఇవ్వాల్సి వస్తే నాగుల్ మీరాకూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బుద్దా వెంకన్న. టిక్కెట్లపై ఎవరికిష్టమొచ్చినట్లు వారు మాట్లాడితే కుదరదు అంటూనే... విజయవాడ వెస్ట్ టిక్కెట్ పై చంద్రబాబుకు ఆప్షన్స్ ఇస్తున్నారు. దీంతో బుద్దా వ్యాఖ్యాలపై జలీల్ ఖాన్ ఆ రేంజ్ లో స్పందిస్తూ... ఎంపీ టిక్కెట్ ఎవరిదో కూడా చెప్పేస్తున్నారు.

Tags:    
  • Jalilkhan 
  • Tdp 
  • Buddavenkana 
  • Chandrababunaidu 
  • Vijayawadaeast 
  • Kesineninani 
  • Naralokesh 

Similar News

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS