బాబు...పవన్ లను కలసికట్టుగానే....జగన్ మార్క్ స్ట్రాటజీ!

చంద్రబాబును మాత్రం పేరు పెట్టి విమర్శిస్తూ వస్తున్న జగన్ పవన్ పేరుని ఈ రోజుకీ డైరెక్ట్ గా తన నోటితో అనడం లేదు దత్తపుత్రుడు అనే అంటున్నారు

Update: 2023-09-19 12:31 GMT

ఇప్పటిదాకా కేవలం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రమే జగన్ టార్గెట్ చేస్తూ వస్తూండేవారు. జనసేన పార్టీని లైట్ తీసుకునేవారు. ఆ బాధ్యతలను మాజీ మంత్రి పేర్ని నాని వంటి వారు చూసుకునేవారు. అయితే పొత్తులు ఏపీలో కుదిరాక టీడీపీ జనసేన చెట్టాపట్టాలు వేసుకున్నాక జగన్ కూడా స్ట్రాటజీ పూర్తిగా మార్చేశారు.

ఆయన చంద్రబాబుతో పాటు పవన్ మీద కూడా విమర్శల డోస్ పెంచేశారు. అయితే ఇక్కడ చిన్న తేడా ఉంది. చంద్రబాబును మాత్రం పేరు పెట్టి విమర్శిస్తూ వస్తున్న జగన్ పవన్ పేరుని ఈ రోజుకీ డైరెక్ట్ గా తన నోటితో అనడం లేదు దత్తపుత్రుడు అనే అంటున్నారు ఇపుడు పవన్ పొత్తులలో ఉన్నారు కాబట్టి అది పూర్తిగా సూట్ అయింది అని భావిస్తూ ఇంకా వాడిగా వేడిగా వాడుతున్నారు.

ఇక చంద్రబాబు విషయం తీసుకుంటే గత పన్నెండేళ్ళుగా జగన్ వర్సెస్ బాబు పాలిటిక్స్ సాగుతూనే ఉంది. 2014, 2019 ఎన్నికల్లో బాబునే టార్గెట్ చేస్తూ జగన్ ప్రసంగాలు చేసేవారు. ఈసారి అంటే 2024 కి మాత్రం ఒక చేంజ్ అయితే కనిపిస్తోంది. పవన్ని కూడా ముందు పెట్టి జగన్ విమర్శలు చేయడం.

ఇక పవన్ పార్టీ పెట్టినపుడు ఒక స్లోగన్ ని ఎక్కువగా వాడేవారు. ఇపుడు అయితే ఆయన దాన్ని పెద్దగా మాట్లాడడమే లేదు, కానీ రాజకీయ ప్రత్యర్ధులు ఎందుకు ఊరుకుంటాయి. అందుకే పవన్ పాత స్లోగన్ ని బయటకు తీసి మరీ జగన్ హాట్ కామెంట్స్ చేస్తునారు. ప్రశ్నిస్తాను అంటూ పార్టీ పెట్టిన పెద్ద మనిషి ప్రశ్నించడం మానేశారు అని జగన్ అంటున్నారు.

Read more!

అది నిన్న నిడదవోలు సభ అయినా నేడు కర్నూల్ మీటింగ్ అయినా కూడా పవన్ మీద ధాటీగానే కామెంట్స్ చేస్తున్నారు. అంతా తోడు దొంగలు అని వీరందరిదీ ఒక్కటే విధానం అని జగన్ గట్టిగానే ఆడిపోసుకుంటున్నారు. దోచుకో దాచుకో పంచుకో అన్న విధానంతోనే వీరంతా ముందుకు పోతున్నారు అని జగన్ నిప్పులు చెరుగుతున్నారు.

ప్రశ్నిస్తాను అని నిన్నటిదాకా అంటూ వచ్చిన పవన్ కానీ అలాగే ప్రజలకు నిజాలు చెప్పాల్సిన మీడియా కానీ బాబు అవినీతి మీద మాట్లాడకపోవడం వెనక అసలు కారణం అంతా ఒక్కటి కావడం అని జగన్ ఆరోపిస్తున్నారు. బాబు అవినీతిలో అందరికీ వాటాలు ఉన్నాయని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ మీద జగన్ ఒక రేంజిలో విమర్శలు చేస్తున్నారు.

దత్తపుత్రుడు బాబు దోస్తులు అని అంటూ టీడీపీకి జనసేనకు తేడా లేదని, రెండూ ఒక్కటే అని జనాలకు చెప్పాల్సింది చెబుతున్నారు. ఈ విధంగా చెప్పడం ద్వారా జనసేన వైపు ఉండే వారు కానీ ఈ రెండు పార్టీల పొత్తును చూసి న్యూట్రల్ సెక్షన్స్ ఎవరైనా ఈ వైపుగా రావాలనుకున్నా వారికి అసలు విషయం చెబుతూ జగన్ కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నారు అంటున్నారు.

పవన్ నీతిమంతుడు అని అనుకునే వారికి కూడా ఆయన బాబు అవినీతికి వత్తాసు పలకడం ద్వారా తానూ అటేనని చెప్పడమే వైసీపీ వ్యూహంగా ఉంది. రానున్న రోజులలో జగన్ నోట పవన్ పేరు వస్తుందా పవన్ మీద జగన్ విమర్శల ధాటీ ఇంకా పెరుగుతుందా అంటే వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News