షర్మిళతో గ్యాప్ పై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలతో ఏపీలో రాజకీయ సందడి నెలకొంది.

Update: 2024-05-09 09:14 GMT

ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలతో ఏపీలో రాజకీయ సందడి నెలకొంది. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం వైఎస్ జగన్ వర్సెస్ కూటమి అనేలా రాజకీయాలు నడుస్తుంటే.. కడపలో మాత్రం వైఎస్ జగన్ వర్సెస్ షర్మిళ అన్నట్లుగా పరిస్థితి మారిందని చెబుతున్నారు. ప్రధానంగా వైఎస్ వివేకా హత్య కేసు – అవినాష్ కి కడప ఎంపీ టిక్కెట్ వంటి విషయాలపై షర్మిళ విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో జగన్ స్పందించారు.

అవును... గతకొన్ని రోజులుగా వైఎస్ వివేకా హత్య కేసునే ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగించుకున్నట్లుగా ముందుకు సాగుతున్న షర్మిళ... ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. ఈ నేపథ్యంలో తన చెల్లెలు షర్మిళతో గ్యాప్ ఎక్కడ మొదలైందనే విషయాన్ని జగన్ వెల్లడించారు. తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబందించిన విషయాలను కాస్త నర్మగర్భంగా అన్నట్లుగా వెల్లడించారు!

ఇందులో భాగంగా... రిలేషన్స్‌ లోకి రాజకీయాలు చొరబడితే ఆ కుటుంబాల్లో కల్మషం వస్తుందని మొదలుపెట్టిన సీఎం వైఎస్ జగన్... కుట్ర కోణంలో ఉండే చంద్రబాబు ఆ వివాదాన్ని మరింత రెచ్చగొట్టారని అన్నారు. కుటుంబ సభ్యులకు అవకాశాలు ఇస్తే బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు తప్పవని వెల్లడించారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు సవాళ్లు వస్తాయని... ఆ సమయంలో మనం తీసుకునే నిర్ణయాలు మన క్యారెక్టర్‌ ను నిర్వచిస్తాయని అన్నారు.

ఇక... తాను ముఖ్యమంత్రి అయింది తన కుటుంబ సభ్యలను కోటీశ్వరులను చేయటానికి కాదని క్లారిటీ ఇచ్చారు వైఎస్ జగన్. ఇదే సమయంలో... చంద్రబాబు, రేవంత్ ఏపీలో కాంగ్రెస్ ను ఆపరేట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్‌ కు రాలేదని గుర్తు చేశారు. ఇదే క్రమంలో... అయిదేళ్ల కాలంలో తాను డెవలప్ మెంట్ చేయలేదంటూ దురుద్దేశ పూర్వకంగా ప్రచారం చేస్తున్నారని జగన్ వివరించారు!

Tags:    

Similar News