బాబు పాలనను అలా పోల్చిన జగన్!

ఆ స్వేచ్చ ఉండాల్సిన చోట బాబు మాత్రం దానిని లేకుండా చేస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.;

Update: 2025-07-12 13:25 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి పాలన మీద వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు. ఎక్స్ వేదికగా ఆయన బాబు మీద ఒక స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఒక సుదీర్ఘమైన ట్వీట్ ని కూడా పోస్ట్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని బాబు రాష్ట్ర యంత్రాంగం అండతో ప్రజాస్వామ్య శక్తులను అణచివేయడం చేస్తున్నారని జగన్ నిందించారు.

దానికి ఆయన ఒక అద్యిదు ఉదాహరణలను చూపించారు. తాను ఎపుడు పర్యటనలకు వెళ్ళినా వివాదాలు రాజేయడం ఆయన గుర్తు చేశారు పైగా పోలీసులను అడ్డు పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో విపక్షం ప్రజల వద్దకు వెళ్ళడం హక్కుగా ఆయన చెప్పారు.

ఆ స్వేచ్చ ఉండాల్సిన చోట బాబు మాత్రం దానిని లేకుండా చేస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించుకుని తన ప్రభుత్వం మీద ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడకూడదన్నట్లుగా బాబు వ్యవహరిస్తున్నారు అని జగన్ అన్నారు.

నిజానికి ప్రశ్నించేదుకు, నిరసన తెలిపేందుకు అలాగే తమ అభిప్రాయాలను చెప్పుకునేందుకు ఒక చోట సమావేశమయ్యేదుకు ప్రతీ ఒక్కరికీ హక్కు ప్రజాస్వామ్యం లో ఉందని ఆయన అన్నారు. అలా అలా ప్రతీ పౌరుడూ తన భావాలను వ్యక్తం చేయడానికి అవకాశం ప్రజాస్వామ్యం ఇచ్చిందని జగన్ అన్నారు. కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం నియంతృత్వ పోకడలనే అమలు చేస్తోందని జగన్ అన్నారు. బాబు పాలన యావత్తు నియంత పోకడలతో సాగుతోందని ఆయన అభివర్ణించారు.

బాబు నాయకత్వంలోని నిరంకుశ పాలన అనే భారీ బరువు కింద ప్రజాస్వామ్యం నిర్దాక్షిణ్యంగా నలిగిపోతోందని జగన్ తన ట్వీట్ లో స్పష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసుల అధికారాన్ని దుర్వినియోగం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో చట్టబద్ధమైన ఆందోళనలను నిర్వహించుకునే అవకాశం లేకుండా పోయిందని ఆయన అన్నారు. ప్రతిపక్షాన్ని పట్టుకుని అణచివేతకు గురి చేస్తున్నారని అడుగడుగునా వేధింపులు ఎదురవుతున్నాయని జగన్ అన్నారు. అంతే కాదు కల్పితమైన కేసులను చట్టపరమైన కేసులుగా ముందుకు తెస్తున్నారని అన్నారు ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగా ప్రజాస్వామ్య స్వేచ్ఛపై జరుగుతున్న అతి పెద్ద దాడిగా ఆయన పేర్కొన్నారు

దానికి ఆయన కొన్ని ఉదాహరణలు ఉముందుంచారు. తాను ఈ ఏడాది ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లాలోని మిర్చి యార్డుకు వెళ్ళాను అని అక్కడ మిర్చీ రైతుల కష్టాలను తెలుసుకోవడానికి వెళ్తే తన మీద ఒక కేసు పెట్టారని అన్నారు.

అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 8న రామగిరిలో టిడిపి అనుచరులు దారుణంగా వైసీపీ నాయకుడు బీసీ వర్గానికి చెందిన నాయకుడు కురుబ లింగమయ్య ని హత్య చేశారని, తాను ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి నేను రాప్తాడు నియోజకవర్గానికి వెళ్తే రాప్తాడు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి తోపదుర్తి ప్రకాష్ రెడ్డిపై కూడా ఒక కేసు నమోదు చేశారు అని జగన్ గుర్తు చేశారు.

అదే విహంగా జూన్ 11న తాను ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు వెళ్ళి అక్కడ రైతులను పరామర్శిస్తే ఏకంగా మూడి కేసులు పెట్టి పదిహేను మంది రైతులను జైలులో పెట్టారని జగన్ ఆరోపించారు. అలాగే మరో నలుగురిని ఇదే సంఘటనలో మందిని అరెస్టు చేశారని అయితే న్యాయస్థానాలు వారు రిమాండ్ నిరాకరించారని జగన్ అన్నారు. ఈ విషయంలో కోర్టులకు ధన్యవాదాలు అని ఆయన చెప్పారు.

ఇక జూన్ 18న తాను సత్తెనపల్లి పర్యటన చేసి పోలీసుల వైఖరి వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఓదార్చానని ఆ సమయంలో కూడా అయిదు కేసులు నమోదు చేసి 131 మందికి నోటీసులు జారీ చేశారని జగన్ అన్నరు. ఇక తాజాగా ఈ నెల 9న తాను బంగారుపాళ్యం మామిడి రైతులకు మద్దతుగా అక్కడ పర్యటనకు వెళ్తే మరో ఐదు కేసులు నమోదు స్థానికంగా ఉన్న వారి మీద పెట్టారని జగన్ వివరించారు. ఇలా ఈ కేసులో ప్రస్తుతం 20 మందికి పైగా పోలీసు కస్టడీలో ఉన్నారని ఆయన చెప్పారు. అయినప్పటికీ గత రెండు రోజులుగా వారిని అధికారికంగా అరెస్టు చేసినట్లు చూపలేదని కోర్టు ముందు సైతం హాజరుపరచలేదన్ జగన్ ఆరోపించారు.

ఇలా ఈ అయిదు సంఘటనలలో కేసులు పెట్టడం అరెస్టులు చేయడం ద్వారా విపక్షాన్ని నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని జగన్ అన్నరు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అని ఆయన అన్నారు. స్వేచ్చ మీద దాడులు ఏకపక్షంగా జరుగుతున్నా తాము ఎదుర్కొంటామని ఆయన చెప్పారు తాను ఎక్కడా తగ్గేది లేదని జగన్ ట్వీట్ లో పేర్కొనడం విశేషం.

ఇలా ఎటు చూసినా నిర్బంధాలు అనేక రకాలైన వేధింపులు ఉన్నప్పటికీ రాష్ట్రంలోని ఏకైక ప్రతిపక్ష పార్టీగా వైసీపీ తన బాధ్యతను నెరవేర్చి తీరుతుందని జగన్ పేర్కొన్నారు. మొత్తం మీద జగన్ గత అయిదు నెలలుగా తన పర్యటనల మీద కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసుల మీద పూర్తి వివారాలు తనదైన శైలిలో అందించారు. మరి వీటి మీద ఆయన జాతీయ స్థాయిలో పోరాడుతారా లేక ఇదే తీరున జనం దృష్టిలో ఉంచుతూ లోకల్ గా పోరాడుతారా అన్నది చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News