జ‌గ‌న్‌కు నిర‌స‌న సెగ‌... తెనాలిలో ఎస్సీల ధ‌ర్నా!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు తీవ్ర నిర‌స‌న సెగ ఎదురైంది. తాజాగా మంగ‌ళ‌వారం జ‌గ‌న్‌.. తెనాలిలో ప‌ర్య‌టించేందుకు వచ్చారు.;

Update: 2025-06-03 11:35 GMT

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు తీవ్ర నిర‌స‌న సెగ ఎదురైంది. తాజాగా మంగ‌ళ‌వారం జ‌గ‌న్‌.. తెనాలిలో ప‌ర్య‌టించేందుకు వచ్చారు. ఇటీవ‌ల తెనాలి ప‌ట్ట‌ణ పోలీసులు.. ఓ ముగ్గురు యువ‌కుల‌ను న‌డి రోడ్డుపై లాఠీల‌తో కొట్టిన విష‌యం రాష్ట్రవ్యాప్తంగా చ‌ర్చ‌కు, విమ‌ర్శ‌ల‌కు కూడా కార‌ణ‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆయా యువ‌కుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ తెనాలికి వ‌చ్చారు.

అయితే.. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఎస్సీ, ఎస్టీల‌కు చెందిన కొన్ని కుటుంబాల‌ వారు.. అదే విధంగా ప‌లు సం ఘాల నాయకులు రోడ్డెక్కారు. బ్లాక్ బెలూన్ల‌తో జ‌గ‌న్‌కు స్వాగ‌తం ప‌లికారు. అంతేకాదు.. కొంద‌రు న‌డిరోడ్డు పై కూర్చుని ధ‌ర్నా చేశారు. జ‌గ‌న్ ప‌రామ‌ర్శించే యువ‌కుల కుటుంబాల‌కు.. నేర చ‌రిత్ర ఉంద‌ని.. గంజా యి బ్యాచ్ అని నిర‌స‌న కారులు నినాదాలు చేయ‌డం గ‌మ‌నార్హం.

స‌మాజానికి.. ప్ర‌జ‌ల‌కు కూడా ఇబ్బంది క‌లిగిస్తున్న యువ‌కులను పోలీసులు శిక్షించ‌డం స‌రైన చ‌ర్యేన‌ని వారు వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ అలాంటి సంఘ వ్య‌తిరేక శ‌క్తుల‌కు అండగా నిల‌వ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ప‌లు సంఘాల ఆధ్వ‌ర్యంలో తెనాలిలో జ‌గ‌న్ వ‌చ్చే ప్రాంతంలో మానవ హారాలు నిర్మించి.. ఆయ‌న‌కు నిర‌స‌న తెలిపారు. అయితే.. పోలీసులు వీరిని ప‌క్క‌కు పంపించే ప్ర‌య‌త్నం చేసినా.. వారు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News