జగన్ కు బీఆర్ఎస్ పోయి.. కవిత వచ్చే...!
వైసీపీ అధినేత జగన్‌కు ఇరుగు పొరుగు రాష్ట్రాల మద్దతు ఉన్న విషయం తెలిసిందే. సమయం చూసుకు ని స్పందించే నాయకులు ఉన్నారు.
వైసీపీ అధినేత జగన్‌కు ఇరుగు పొరుగు రాష్ట్రాల మద్దతు ఉన్న విషయం తెలిసిందే. సమయం చూసుకు ని స్పందించే నాయకులు ఉన్నారు. అయితే.. ఒక్కొక్కసారి ఆయనను విమర్శించిన పొరుగు రాష్ట్ర నేతలు కూడా కనిపిస్తారు. హరీష్‌రావు, కేటీఆర్‌వంటి తెలంగాణ నాయకులు జగన్‌కు మిత్రులే అయినా.. సమయం సందర్భం చూసుకుని ఆయనను సమర్థించారు. ఒక్కొక్కసారి తీవ్రంగా విమర్శించారు. 4 వేల కోట్ల కోసం.. జగన్.. రైతులను ఫణంగా పెట్టారంటూ.. గతంలో హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
అప్పట్లో రైతులు వాడే విద్యుత్‌కు స్మార్ట్ మీటర్లు పెట్టే నిర్ణయం తీసుకున్నారు జగన్. ఇది కేంద్ర ప్రభు త్వం చెప్పడంతోనే .. చేశారని హరీష్‌రావు చెప్పారు. అంతేకాదు.. ఇలా చేస్తే.. కేంద్రం నుంచి 4 వేల కోట్ల రూపాయల మేరకు జగన్ ప్రభుత్వానికి అప్పుగా వస్తోందన్నారు. ఇది రాజకీయంగా జగన్‌కు ఇబ్బంది సృష్టించింది. ఇక, కేటీఆర్ కూడా.. ఏపీలో వైసీపీ పాలనా సమయంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించి ..ఇరుకున పడేశారు. ఏపీలో ఎక్కడ చూసినాగుంతల రోడ్లే ఉన్నాయని.. తన స్నేహితులు చెప్పారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అయినప్పటికీ.. జగన్ బీఆర్ఎస్ నాయకుల తో కలివిడిగానే ఉంటున్నారన్న చర్చ ఉంది. కట్ చేస్తే.. ఇప్పుడు బీఆర్ఎస్ స్థానంలో కవిత తెరమీదికి వచ్చారు. నేరుగా జగన్‌ను ఆమె సమర్థించకపోయినా.. అసందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు.. వైసీపీలో చర్చకు దారితీశాయి. జగన్ రాజధాని విషయంలో చేసిన `మావిగన్` ప్రకటనను కవిత స్వాగతిస్తున్నట్టుగా మాట్లాడారు. దీనిని అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వంపైనా ముఖ్యంగా సీఎం చంద్రబాబుపైన, రాజధాని అమరావతిపైనా విమర్శలు గుప్పించారు.
దీంతో వైసీపీ నాయకులు తమ కు బూస్ట్ వచ్చిందని అనుకుంటున్నారు. కానీ, ఇది వాపే తప్ప బలుపు కాదని.. తెలంగాణ నాయకులను విశ్వసించడం సరికాదని చెబుతున్న వారు కూడా ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటారో తెలియని.. కవిత గారి లాంటి నాయకులను నమ్మితే.. నిండా మునగడం కాయమ ని అంటున్నారు. కాబట్టి.. కవిత ఏదో చెప్పారని.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారని.. పొంగిపోతే.. అది మొత్తానికే ఇబ్బంది అవుతుందని చెబుతున్న నాయకులు కూడా ఉన్నారు.