రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్: జగన్‌కు తలనొప్పులు ..!
ఈ క్రమంలోనే వైసిపి అధినేత జగన్.. డిజిటల్ బుక్ ను తీసుకొచ్చారు పార్టీ నాయకులకు ఆయన భరోసా ఇచ్చారు.;
అధికారంలో ఉన్న టిడిపి రెడ్ బుక్ ను అమలు చేస్తున్నామని చెబుతోంది. దీనిపై ఎటువంటి సందేహా లు లేకుండా బహిరంగంగానే మంత్రి నారా లోకేష్ ప్రకటనలు చేస్తున్నారు. రెడ్ బుక్ ని చూసి వైసిపి నాయకులు తడిపేసుకుంటున్నారని కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులపై నమోదవుతున్న కేసులు, అరెస్టు చేస్తున్న తీరు కూడా రెడ్ బుక్కును తలపిస్తోందని వైసిపి నాయకులు పదేపదే విమర్శలు గుప్పిస్తున్నారు. రెడ్ పాలన సాగుతోందని.. కూడా నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. అయినా.. తాము భయపడేది లేదని అంటున్నారు.
ఈ క్రమంలోనే వైసిపి అధినేత జగన్.. డిజిటల్ బుక్ ను తీసుకొచ్చారు పార్టీ నాయకులకు ఆయన భరోసా ఇచ్చారు. డిజిటల్ బుక్ లో నమోదు చేసే ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏ ఒక్కరిని వదిలి పెట్టకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఎక్కడ దాక్కున్నా పట్టి తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా మని అని చెప్పుకొచ్చారు. అంటే ఒక రకంగా అటు రెడ్ బుక్కు ఇటు డిజిటల్ బుక్ వ్యవహారాలు ఇరు పార్టీలోనూ చర్చనీయాంశాలయ్యాయి. అంతేకాదు, రాజకీయంగా వివాదానికి కూడా దారితీశాయి.
క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు కూడా రెండుగా విడిపోయి రెడ్ బుక్, డిజిటల్ బుక్ పేర్లతో విమర్శలు గుప్పించుకోవడం సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకోవడం కామన్ అయిపోయింది. మరోవైపు డిజిటల్ బుక్ లో వస్తున్న ఫిర్యాదులు వైసిపి నాయకుల పైన ఎక్కువగా వస్తుండడం జగన్ కు తలనొప్పిగా మారింది. సాధారణంగా డిజిటల్ బుక్‌ను ఆయన ఓపెన్ గానే ఉంచారు. వాస్తవానికి ఇది పార్టీ నాయకుల కోసం అని చెప్పినప్పటికీ దీన్ని అందరూ వినియోగించుకునేలాగా ఏర్పాటు చేశారు.
అంటే దీని ఉద్దేశం ప్రజల నుంచి కూడా సమస్యలు తీసుకుని వారి అభిప్రాయాలు ప్రకారం తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుందామనేది జగన్ ఉద్దేశం. కానీ దీనికి భిన్నంగా వైసీపీ నాయకుల పైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ డిజిటల్ బుక్ లో ఇప్పటికే 32 ఫిర్యాదులు నమోదు కావడం జగన్‌కు తలనొప్పిగా మారింది. వాస్తవానికి తమ పార్టీ నాయకుల పై అధికార పక్షం చేసే అరాచకాలను ఈ పుస్తకంలో నమోదు చేసి తాము వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని ఆయన భావించారు.
కానీ, దీనికి భిన్నంగా అనేక మంది.. వైసీపీ నాయకులు గతంలో చేసిన అరాచకాలను ఫోటోలతో సహా వీడియోలతో సహా ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో జగన్ అవాక్కవుతున్నారు. ఏం చేయాలి? దీనిపై ఎట్లా ముందుకు వెళ్లాలనే విషయంపై ఆయన తీవ్రస్థాయిలో అంతర్మథనం చెందుతున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.