నితీష్ కి జగన్ ట్వీట్...ఇంట్రెస్టింగ్ !
బీహార్ కి ఐదవసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం సాగింది.;
బీహార్ కి ఐదవసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం సాగింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ వెళ్ళారు. వారిని ఎన్డీయే పెద్దలు ఆహ్వానించారు. మరో వైపు చూస్తే ఏపీకి చెందిన మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త సీఎం నితీష్ కుమార్ కి గ్రీట్ చేశారు. ఆయన ప్రమాణం చేసిన సందర్భంగా అభినందనలు తెలియచేశారు. ప్రజారంజకమైన పాలన సాగించాలని జగన్ ఆ ట్వీట్ లో కోరుకున్నారు.
ఫస్ట్ టైం అలా :
ఇదిలా ఉంటే జగన్ ఒక ఎన్డీయే కూటమికి చెందిన ముఖ్యమంత్రికి ఇలా ట్వీట్ చేయడం ఇదే తొలిసారి అని అంటున్నారు. జగన్ అయితే ఏపీలో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఆయన ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు. మరో వైపు చూస్తే జగన్ ఎపుడూ ఎన్డీయే ముఖ్యమంత్రులకు ఈ విధంగా ట్వీట్ చేసింది లేదు అని అంటున్నారు. పైగా ఆయన అటు ఎన్డీయేలో లేరు, ఇటు ఇండియా కూటమిలో కూడా లేరు. ఈ నేపధ్యంలో జగన్ తనదైన తటస్థ వాదానికి కట్టుబడి కొనసాగుతున్నారు. కానీ ఆయన నితీష్ కుమార్ కి ట్వీట్ చేయడమే ఇపుడు చర్చగా ఉంది.
గతంలో వారంతా కూడా :
మరో వైపు చూస్తే ఎన్డీయే కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చాక ఓటమి అన్నది లేకుండా దూసుకుని పోతోంది మొదట హర్యానా ఎన్నికలు వచ్చాయి. అక్కడ బీజేపీ వరసగా మరోసారి గెలిచింది ఇక మహారాష్ట్రలో కూడా అదే ఫలితం రిపీట్ అయింది. ఢిల్లీలో కూడా బీజేపీ పాలన మొదలైంది. ఈ మూడు రాష్ట్రాలలో కూడా ఎన్డీయే ముఖ్యమంత్రులు ప్రమాణం చేసినపుడు జగన్ ఎపుడూ వారిని గ్రీట్ చేసింది లేదని అంటున్నారు. అంతే కాదు హర్యానాలో బీజేపీ గెలవడం కాంగ్రెస్ ఓటమి తరువాత ఈవీఎంల మీద కాంగ్రెస్ విమర్శలు చేస్తే దానికి మద్దతుగా వైసీపీ మాట్లాడిన సందర్భం కూడా ఉంది అని గుర్తు చేస్తున్నారు.
నితీష్ ఎందుకు స్పెషల్ :
అలాంటిది నితీష్ కుమార్ విషయంలోనే ఎందుకు జగన్ గ్రీట్ చేశారు అన్నదే ఒక కీలక పాయింట్ గా ఉంది. పైగా నితీష్ కి ఇది తొలి పర్యాయం సీఎం పదవి కాదు, ఆయన 2020లో సైతం ఎన్డీయే కూటమి నంచి సీఎం గా ప్రమాణం చేశారు. 2005, 2010, 2017 ఇలా ఇప్పటికి అయిదు సార్లు ఎన్ డీయే సీఎం గానే ఆయన ప్రమాణం చేశారు మధ్యలో రెండు సార్లు ఇండియా కూటమి సీఎం గా ప్రమాణం చేశారు. కానీ ఎన్నడూ లేనిది జగన్ గ్రీట్ చేయడం అంటే రాజకీయంగా వైసీపీ ఆలోచనలు ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తోంది. అయితే కొత్త ముఖ్యమంత్రులు ఎవరు అయినా గ్రీట్ చేయడం ఆనవాయితీ అనుకున్నా గతంలో లేదు, కాబట్టి ఇది కొంత ఆలోచించాల్సిన విషయమే అని అంటున్నారు. ఇక కేంద్రంలో ఎన్డీయే కి కీలక మద్దతుదారులుగా ఏపీ నుంచి చంద్రబాబు బీహార్ నుంచి నితీష్ కుమార్ ఉన్నారు. సో ఏపీ సీఎం మీద వైసీపీ రాజకీయ పోరాటం అనివార్యం. మరి నితీష్ కుమార్ వేరే రాష్ట్రం కాబట్టి గ్రీట్ చేసారా అన్నది కూడా ఉంది అని అంటున్నారు.