బాబు యాక్టింగ్ సూపరంటూనే జగన్ పుష్ప మేనరిజం!

నటన అంటే ఎన్టీఆర్ అందరికీ గుర్తుకు వస్తారు. అయితే ఎన్టీఆర్ నే నటనలో చంద్రబాబు మించిపోయారు అని వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు.;

Update: 2025-07-16 11:56 GMT

నటన అంటే ఎన్టీఆర్ అందరికీ గుర్తుకు వస్తారు. అయితే ఎన్టీఆర్ నే నటనలో చంద్రబాబు మించిపోయారు అని వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు. బాబు యాక్టింగ్ దెబ్బకు దాన వీర శూర కర్ణ అయిన ఎన్టీఆర్ కూడా వెనక్కే అని సెటైర్లు పేల్చారు. బాబు నటనను అలా జగన్ వ్యంగ్యంగా మెచ్చేసుకున్నారన్న మాట.

ఇక చూస్తే కనుక ఎన్టీఆర్ యాక్టింగ్ ఎక్కడో వెనక్కిపోతోందని అన్నారు. అలా లైవ్ లో జీవిస్తున్నారని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో జగన్ కూడా పుష్ప సినిమాలో హీరో మేనరిజం ని మీడియా ముందు ప్రదర్శించడం విశేషం.

ప్రజలు మెచ్చేలా పాలన చేసి అప్పుడు ఇలా చేయ్ అంటూ గడ్డం కింద చేయి పెట్టి పుష్ప మాదిరి మేనరిజాన్ని జగన్ చూపించారు. అలా కాకుండా తమ ప్రభుత్వం మీద ఏదో అన్నారని ప్రతీ ఒక్కరినీ తీసుకుని వెళ్ళి కేసులు పెట్టి జైళ్ళలో వేయడమేంటి అని జగన్ ప్రశ్నించారు.

ఇక జగన్ మరో మాట అన్నారు. సినిమా డైలాగులను పోస్టర్లలో పెడితే అరెస్టు చేసారా అని నిలదీశారు. ఆ డైలాగులు ఉన్న సినిమాలకు సెన్సార్ అనుమతులు ఇచ్చింది కదా అని లాజిక్ పాయింట్ ని లేవదీశారు. ఒకవేళ ఆ డైలాగ్స్ అభ్యంతరకరం అంటే వాటిని సినిమాలో నుంచి తీయించాలని ముందు సెన్సార్ వారిని అడగాలి కదా అని ప్రశ్నించారు.

అంతే కాదు బాలక్రిష్ణ పవన్ కళ్యాణ్ ల సినిమాల్లోనే ఇలాంటి డైలాగులు ఎక్కువగా ఉంటాయని ముందు ఆ డైలాగుల సంగతి చూడాలని జగన్ కోరడం విశేషం. ఈ ఇద్దరి హీరోల సినిమాలలో డైలాగులు దారుణంగా ఉంటాయని జగన్ విమర్శించారు. మరి సెన్సార్ బోర్డు అనుమతిస్తోంది కదా అంటూ మీ పోరాటం అక్కడ చేయండని సలహా ఇచ్చారు.

అంతే కాదు ఫ్యామస్ అయిన సినిమాలలో డైలాగులను పాటలను బయట అనుకరిస్తే తప్పు ఎలా అవుతుందో కూటమి పెద్దలు చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. అవి అభ్యంతరకరమైన డైలాగులు అయినపుడు ఆ సినిమాలనే ఆపేయాలని కోరారు.

మొత్తం మీద జగన్ తన మీడియా సమావేశంలో కాసేపు సినిమాల గురించి అందులో డైలాగుల గురించి కూడా మాట్లాడారు. అంతే కాదు బాలయ్య పవన్ సినిమాల మీద విమర్శలు చేస్తూనే చంద్రబాబుకు మహానటుడు అని బిరుదు ఇచ్చేశారు పనిలో పైగా పుష్ప మేనరిజంతో తాన నటనను సైతం మీడియాకు చూపించారు.

ఇవన్నీ పక్కన పెడితే సినిమాల ప్రభావం రాజకీయ పార్టీల మీద ఎంత ఉందో తెలియదు కానీ వైసీపీ నేతల మీద బాగానే ఉంది అని అంటున్నారు. జగన్ అయితే పుష్ప మేనరిజాన్ని అసలు ఎక్కడా వదలడం లేదు అని గుర్తు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News