జాక్ క్లార్క్ హెచ్చరిక.. ఏఐ చేతిలోనే మనుషుల భవిష్యత్తు అంతం కానుందా?

ప్రస్తుత ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు తెలియని వారు లేరు. చాట్ జీపీటీ, గూగుల్ జెమిని అంటూ ప్రతి ఒక్కరూ ఏఐ వైపే అడుగులు వేస్తున్నారు.

Update: 2026-05-23 16:30 GMT

ప్రస్తుత ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు తెలియని వారు లేరు. చాట్ జీపీటీ, గూగుల్ జెమిని అంటూ ప్రతి ఒక్కరూ ఏఐ వైపే అడుగులు వేస్తున్నారు. అయితే, ఈ టెక్నాలజీ భవిష్యత్తులో ఎంతటి ప్రమాదకరంగా మారబోతుందో చెప్తూ ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ కో-ఫౌండర్ జాక్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ విషయంలో మనం అప్రమత్తంగా లేకపోతే అది భూమిపై ఉన్న మానవాళినే అంతం చేసే అవకాశం ఉందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఆ ఆందోళనకర విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొవిడ్ లాంటి మహమ్మారితో పోలిక:

జాక్ క్లార్క్ అభిప్రాయం ప్రకారం.. ఏఐ సాంకేతికతను నిర్లక్ష్యం చేయడం అంటే కొవిడ్ వంటి భయంకరమైన మహమ్మారిని లైట్ తీసుకోవడంతో సమానం. ఒకసారి వైరస్ విజృంభిస్తే మనం ఏమీ చేయలేనట్లే, ఏఐ పరిధి దాటిపోతే సమాజంలో తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ఇక ప్రభుత్వాలు, టెక్ సంస్థలు దీనిపై ఇప్పటి నుంచే స్పష్టమైన నియంత్రణలు అమలు చేయకపోతే, భవిష్యత్తులో ఊహించని నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.

మనుషుల కంటే ఎక్కువ తెలివితేటలు:

ప్రస్తుతం ఏఐ మనకు కేవలం సాయం చేసే స్థాయిలోనే ఉంది. కానీ, రాబోయే రోజుల్లో ఇది మనుషుల ఆలోచనా సామర్థ్యం మరియు తెలివితేటల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కెపాసిటీని సొంతం చేసుకోబోతోందని క్లార్క్ వివరించారు. ఇక ఎప్పుడైతే ఒక మిషన్ మనిషి కంటే పవర్‌ఫుల్‌గా మారుతుందో, అప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం మన చేతుల్లో ఉండదని ఆయన బాంబు పేల్చారు.

మనుషులందరినీ చంపేయగలదా?:

జాక్ క్లార్క్ చేసిన వ్యాఖ్యల్లో అత్యంత షాకింగ్ విషయం ఇదే. ఒకవేళ ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం చేసే వ్యక్తుల చేతుల్లో పడినా, లేదా అది స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరినా, తీవ్రమైన వినాశనానికి దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇక అది భూమిపై ఉన్న ప్రతి ఒక్కరినీ చంపేసేంత ప్రమాదకరమైన పరిస్థితులను కూడా సృష్టించగలదని హెచ్చరించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఏఐ వల్ల మన పనులు సులువవుతున్న మాట నిజమే అయినప్పటికీ, దాని వెనుక ఉన్న ముప్పును మనం అస్సలు మర్చిపోకూడదు. ఇక సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో లాగా రోబోలు ప్రపంచాన్ని ఏలే రోజులు రాకుండా ఉండాలంటే, ఈ టెక్నాలజీని ఒక హద్దులో ఉంచడం ఎంతైనా అవసరం. మరి జాక్ క్లార్క్ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ వార్నింగ్‌ను చూసైనా ప్రపంచ దేశాలు ఏఐపై కఠినమైన రూల్స్ తెస్తాయో లేదో చూడాలి.

Tags:    

Similar News