• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నిజంగా సీపీఎంకు అవమానమేనా...

నిజంగా సీపీఎంకు అవమానమేనా ?

| అయితే ఎప్పుడైతే అధికారపార్టీతోనో లేకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీతోనో పొత్తులు కుదుర్చుకోవటం మొదలుపెట్టాయో అప్పటి నుండే ప్రజాసమస్యల మీద ఉద్యమాలు చేయటం తగ్గిపోయాయి.

By - Tupaki Desk
Update: 2023-11-03 04:43 GMT

పొత్తుల పేరుతో సీపీఎంకి జరిగింది నిజంగా అవమానమనే చెప్పాలి. ఇన్నిరోజులు ఏ సంగతి చెప్పకుండా నాన్చి నాన్చి చివరకు గతంలో ఇస్తామని చెప్పిన సీట్ల విషయంలో కూడా కాంగ్రెస్ వెనక్కుపోయిందంటే సీపీఎంకు అవమానం కాక మరేమిటి ? అవమానం జరిగిందనటంలో సందేహంలేదు కానీ ఎందుకింత అవమానం జరిగిందన్నదే అసలు పాయింట్. తెలంగాణాలో అయినా ఏపీలో అయినా కమ్యూనిస్టులంటే ఇపుడు ఎవరికీ పెద్దగా గౌరవం లేదనే చెప్పాలి. కారణం ఏమిటంటే తమంతట తామే జనాల్లో కమ్యూనిస్టు పార్టీలు పలుచనైపోయాయి.

ఒకపుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలంటే జనాల్లో నమ్మకం ఉండేది, ఇతర రాజకీయ పార్టీల్లో ఒక భయం ఉండేది. అయితే ఎప్పుడైతే అధికారపార్టీతోనో లేకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీతోనో పొత్తులు కుదుర్చుకోవటం మొదలుపెట్టాయో అప్పటి నుండే ప్రజాసమస్యల మీద ఉద్యమాలు చేయటం తగ్గిపోయాయి. దీనికి అదనంగా ప్రభుత్వంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని వ్యక్తిగత ప్రయోజనాలు అందుకోవటం ఎక్కువైపోయాయి.

చాలామంది కమ్యూనిస్టు నేతలపై అవినీతి ఆరోపణలు విపరీతంగా వచ్చేశాయి. దాంతో జనాల్లో ఎర్రన్నలపై నమ్మకం పోయింది. ఏ పార్టీలనైతే బూర్జువా పార్టీలని ఆరోపిస్తున్నాయో ఆ పార్టీతోనే వివిధ కారణాలతో అంటకాగటం ఎక్కువపోయింది. అందుకనే ఉద్యమాలకు దూరంగా జరిగాయి. ఎప్పుడైతే ఉద్యమాలకు, ప్రజా సమస్యలపై ఆందోళనలకు వాపక్షాలు దూరంగా జరిగాయో జనాల్లో నమ్మకాన్ని కోల్పోయాయి. ఇదే సమయంలో రాష్ట్రవిభజన జరగటం మరో నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇలాంటి అనేక కారణాల వల్ల ఇపుడు కమ్యూనిస్టు పార్టీలు ప్రాభవం కోల్పోయాయి.

అందుకనే ప్రధాన పార్టీలకు బాగా చులకనైపోయాయి. ఈకారణంగానే మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టు పార్టీలతో కేసీయార్ ఒప్పందం చేసుకుని కూడా తర్వాత కాదు పొమ్మన్నారు. ఇపుడు కాంగ్రస్ కూడా దాదాపు అదే దారిలో నడుస్తోంది. అందుకనే 17 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించింది సీపీఎం. ఇపుడు కమ్యూనిస్టు పార్టీల పరిస్ధితి ఎలాగైపోయిందంటే ఏ నియోజకవర్గంలోను సొంతంగా గెలిచేంత పరిస్ధితి లేదు. అయితే ప్రత్యర్ధుల్లో ఎవరినో ఒకళ్ళని ఓడగొట్టేందుకు మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో వాటి బలం సరిపోతుందని చెప్పాలి. పరిస్ధితి ఇలాగే కంటిన్యు అయితే ఓడగొట్టేంత సీను కూడా కోల్పోవటం ఖాయమనే అనిపిస్తోంది.

Tags:    
  • Telanganaelections 
  • Cpmparty 
  • Congressparty 
  • Kcr 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS