• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రయాన్‌-3... మరో...

చంద్రయాన్‌-3... మరో విన్యాసాన్ని పూర్తి చేసిన ఇస్రో!

| ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన చంద్రయాన్‌-3 మరో విన్యాసాన్ని పూర్తి చేసుకుంది

By - Tupaki Desk
Update: 2023-08-07 08:15 GMT

చంద్రుడిపై కాలుమోపడమే లక్ష్యంగా రోదసిలో పయనిస్తున్న భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 అనుకున్న లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఈ వ్యోమనౌక మరింత చేరువైంది. తాజాగా అది జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువైంది!

అవును... ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన చంద్రయాన్‌-3 మరో విన్యాసాన్ని పూర్తి చేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ఆదివారం రాత్రి ఈ వ్యోమనౌకలోని ఇంజిన్‌ ను మండించడం ద్వారా దీని కక్ష్యను మరింత తగ్గించారు. ఫలితంగా అది చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువైంది.

ఈ నేపథ్యంలో... మళ్లీ ఇలాంటి విన్యాసాన్ని ఈ నెల 9న మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 గంటల మధ్య నిర్వహించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆ తర్వాత మరో రెండుసార్లు వీటిని చేపడతారు. ఇలా దశలవారీగా వ్యోమనౌక ఎత్తును తగ్గించి.. అంతిమంగా దాన్ని చంద్రుడి చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అనంతరం ఈ నెల 23న ఈ వ్యోమనౌకను చంద్రుడిపైన దించుతారు.

కాగా... జూలై 14న ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీహరికోట నుంచి నింగిలోకి పయనమైన చంద్రయాన్‌-3.. వివిధ దశలు ముగించుకొని శనివారం రాత్రి చందమామ కక్ష్యలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అది భూమి చుట్టూ దశలవారీగా కక్ష్యను పెంచుకొని, ఈ నెల 1న చంద్రుడిని చేరే లూనార్‌ ట్రాన్స్‌ ఫర్‌ ట్రాజెక్టరీలోకి ప్రవేశించింది.

ఈ క్రమంలో... అంతా సవ్యంగా ఉందనుకున్నాక ఈ నెల 17న వ్యోమనౌకలోని ఆర్బిటర్‌-రోవర్‌ మాడ్యూల్‌ కు ఆదేశాన్ని పంపుతుంది. ఫలితంగా అది ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విడిపోయి, సొంతంగా చందమామను చుట్టేస్తుంది. అనంతరం ఈ నెల 23 సాయంత్రం 5.47గంటలకు ల్యాండర్‌-రోవర్‌ చంద్రుడిపై ల్యాండింగ్‌ కు ఉపక్రమిస్తుంది.

Tags:    
  • Chandrayaan3 
  • Lunarorbit 
  • ISRO 
  • Isrochandrayaan3 
  • Propulsionmodule 
  • Chandrayaan3success 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS