• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇరాన్ నో అన్నది.. ఏ...

ఇరాన్ నో అన్నది.. ఏ క్షణమైనా పేలనున్న బాంబు.. పశ్చిమాసియా

| తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్‌ అగ్ర నాయకుడు ఇస్మాయిల్‌ హనియా హత్యపై ఇరాన్ ఇంకా రగులుతూనే ఉంది.

By - Tupaki Desk
Update: 2024-08-14 10:29 GMT

బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ.. నాటో దేశాలైన ఈ మూడూ రంగంలోకి దిగి ఇరాన్ కు నచ్చజెప్పజూశాయి.. అమెరికా, ఖతర్, ఈజిప్ట్ లు ఇజ్రాయెల్- హమాస్ మధ్య సంధి కుదిర్చేందుకు ప్రయత్నించాయి.. కానీ, ఇవేమీ సఫలం అయ్యేలా లేవు. యుద్ధం ఆగేలా లేదు.. పది నెలలుగా పుండులా సలుపుతున్న పశ్చిమాసియా ఇకపై పెద్ద గాయంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే.. చివరకు మూడో ప్రపంచ యుద్ధమూ తప్పదనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడిక చేయగలిగింది.. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకోవడమే..

ఇరాన్ అగ్గిమీద గుగ్గిలం

తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్‌ అగ్ర నాయకుడు ఇస్మాయిల్‌ హనియా హత్యపై ఇరాన్ ఇంకా రగులుతూనే ఉంది. తీవ్ర ప్రతీకారంతో ఇజ్రాయెల్ మీద దాడికి సిద్ధం అని గతంలోనే ప్రకటించింది. అది ఈ వారంలోనే ఉంటుందని, ఇందకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నట్లు

తాజాగా అమెరికా నిఘా విభాగం ఇజ్రాయెల్ ను హెచ్చరించింది. అయితే, ఇరాన్ ను బుజ్జగించేందుకు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్‌ దేశాధినేతలు

ప్రయత్నించారు. దాడులు చేస్తే పశ్చిమాసియాలో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతాయని నచ్చజెప్పారు. అయితే, దీనిని ఇరాన్ చెవికెక్కించుకోలేదు. ఇస్మాయిల్‌ హనియెతో పాటు లెబనాన్ లో హెజ్‌బొల్లా కమాండర్‌ ఫాద్‌ షుకూర్ హత్యకు కారణం ఇజ్రాయెల్‌ అన్నది ఇరాన్ ఆరోపణ. దీంతోనే తన అనుకూల ఉగ్రసంస్థలైన హమాస్, హెజ్బొల్లాలతో కలిసి ఇజ్రాయెల్ పై దాడికి సిద్దం అవుతోంది.

శాంతి ప్రయత్నాలకు విఘాతం..

ఓవైపు ఇరాన్ నో అంటుండగా.. మరోవైపు ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య పది నెలలుగా జరుగుతున్న యుద్ధంలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. యుద్ధం ముగింపు ఒప్పందం చేసుకోవాలని ఖతర్, ఈజిప్ట్, అమెరికా కోరాయి. కొన్నాళ్లుగా ఈ దేశాలు శాంతి ప్రయత్నాలు చేస్తున్నాయి. చర్చలూ జరిగాయి. ఆగస్టు 15న గురువారం చర్చలు తిరిగి ప్రారంభమవ్వాల్సి ఉండగా.. ఇరాన్ వైఖరి బయటపడింది. దీంతో హమాస్ కూడా యుద్ధానికి సిద్ధం అని అర్థం అవుతోంది. ఇరాన్ ను కాదని హమాస్ ఏమీ చేయలేని పరిస్థితి. కాగా, ఎర్ర సముద్రంలో మంగళవారం లైబీరియా చమురు నౌకపై మూడుసార్లు దాడులు జరిగాయి. ఇది ఇరాన్ అనుకూల యెమెన్‌ లోని హూతీ తిరుగుబాటుదారుల పనే.

గత ఏప్రిల్ ఇరాన్ దాడులను తన ఐరన్ డోమ్ తో సమర్థంగా ఎదుర్కొన్నది ఇజ్రాయెల్. మళ్లీ ఇప్పుడు క్షిపణులతో ఇరాన్‌ దాడికి దిగితే ఇజ్రాయెల్‌ గట్టిగానే బదులివ్వడం ఖాయం. అయితే, దీనికి తాము మద్దతిస్తామని అమెరికా తెలిపింది. ఇజ్రాయెల్‌ కు రక్షణగా అత్యాధునిక జలాంతర్గామితో పాటు విమాన వాహక నౌక అబ్రహం లింకన్‌ ను హుటాహుటిన తరలిస్తోంది. మరింత వేగంగా చేరుకోవాలని ఆదేశించింది. ఇదేకాక 20 బిలియన్ డాలర్ల ఆయుధ విక్రయాల ఒప్పందానికీ అమెరికా ఆమోదం తెలిపింది. వీటిలో పలు ఫైటర్ జెట్లు, 50పైగా ఎఫ్-15 ఫైటర్ జెట్స్, అడ్వాన్స్‌ డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు, 120 ఎంఎం ట్యాంక్ మందుగుండు సామగ్రి, అధిక పేలుడు మోర్టార్లు ఉన్నాయి. టెక్నాలజీ పరంగా ప్రపచంలోనే అత్యుత్తమ ఆయుధాలున్న ఇజ్రాయెల్ కు అమెరికా అందజేసే ఆయుధాలు తోడైతే ఇక ఆ దేశం మరింత దుర్బేధ్యంగా మారుతుంది.

Tags:    
  • Iran 
  • Hamas 
  • Israel 
  • Israelhamaswar 
  • USA 
  • War 
  • Egypt 
  • Thirdworldwar 
  • France 
  • Germany 
  • Countrys 
  • Irondome 

Similar News

దీపావళి రోజే రూ.1.5 కోట్ల లాటరీ.. ఇంట్లో ఆడబిడ్డ జననం!

2026-11-10 04:36 GMT

ఓటరు కార్డు సర్వాధారం....హక్కు చోరీ అంటున్న విపక్షం !

2026-11-10 03:50 GMT

లాజిక్ తో కొట్టిన బాబు...కొత్త పేరు పెట్టిన జగన్ !

2026-11-10 03:49 GMT

బొత్స అనూష ఓడినా భీమిలీ ఆమెకే... ఎందుకంటే ?

2026-11-10 03:48 GMT

లోకల్ ఫైట్ : మంత్రులకు బాబు మార్కులెన్ని ?

2026-11-10 03:46 GMT

పిల్లలు విదేశాల్లో.. పెద్దలు పల్లెల్లో.. ఒంటరితనాన్ని తరిమికొడుతున్న ఓ ఊరి కథ

2026-11-10 03:45 GMT

ఆ ఓటు మీ ఇష్టం.. ఇదే కూట‌మికి శాప‌మైందా.. ?

2026-11-10 01:30 GMT

ఏపీ ప‌ల్లె పోరు.. జెండాలు కాదు.. అజెండాలే కీల‌కం.. !

2026-11-10 00:30 GMT

'ఈవీఎంలు' త‌నిఖీ.. మ‌రో రాజ‌కీయ వివాదం!

2026-11-09 23:30 GMT

చిత్రంగా ఉందే.. ఎలా ఓడిపోయాం: బీజేపీ అంతర్మ‌థ‌నం

2026-11-09 22:30 GMT

ఎఫైర్స్ కోసం ప్రత్యేక యాప్.. ఎంతకు తెగించారురా? ఎటు పోతోంది సమాజం?

2026-11-09 19:30 GMT

రెబెల్స్ ని కూటమి తలుపులు క్లోజ్... బాబు కఠిన నిర్ణయం

2026-11-09 19:19 GMT

Copyright @2026

Powered by Blink CMS