అంతవరకూ యుద్ధమాగదు...ఎందుకంటే ?
ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా చేస్తున్న యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు.;
ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా చేస్తున్న యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. సాధారణంగా యుద్ధంలో శత్రు పక్షంలోని అధినేతను హతమార్చడంతో ముగుస్తాయి. కానీ ఇక్కడ యుద్ధం రివర్స్ లో మొదలైంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని తొలి రోజే తొలి గంటలలోనే హతమార్చారు ఆయన చుట్టూ ఉన్న వారిని ఇరాన్ పాలనాలో కీలకమైన వారిని హతమార్చారు. నిజానికి చూస్తే తొలి గంటలలోనే ఇరాన్ నాయకత్వాన్ని మట్టుబెట్టారు. దాంతో యుద్ధం ఆగిపోతుంది అని అంతా అనుకున్నారు కానీ యుద్ధం మరింత భీకరంగా కొనసాగుతోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు.
మ్యాటర్ సీరియస్ గానే :
ఈ ప్రపంచంలోని ముస్లిం దేశాలలో అధికారికంగా అణ్వాయుధాలు కలిగిన ఒకే ఒక దేశం పాకిస్తాన్. మరే ముస్లిం దేశానికి అణు ఆయుధాలు లేవు, ఉండరాదు అన్నది విధానంగా అగ్ర రాజ్యం పెట్టుకున్నట్లు ఉంది. ఇక ఇరాన్ విషయానికి వస్తే ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేస్తోంది అన్నది అమెరికా తీవ్రమైన ఆరోపణ. అయితే ఇరాన్ ప్రస్తుతం అధికారికంగా అణు విధ్వంసక ఆయుధాలను కలిగి ఉన్నట్లు అయితే ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే 1980ల చివరి నుంచి 2003 వరకూ చూస్తే ఇరాన్ అణ్వాయుధాలను పోగు చేస్తోంది అన్నది యునైటెడ్ స్టేట్స్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ 2007లో అంచనా వేసింది. 2010 నుండి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా ఇరాన్ అణు వ్యవహారాలపైన మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని రహస్యంగా చేస్తోంది అని అనుమానాలను వ్యక్తం చేయడమూ జరిగింది.
అణు మానాలతోనే :
ఇదిలా ఉంటే 2025 జూన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక నాయకులు అణు శాస్త్రవేత్తలు అణు సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులను ప్రారంభించింది, ఇది పన్నెండు రోజుల పాటు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంగా మారింది. ఇక జూన్ 22న యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ అణు ప్రదేశాల మీద పెద్ద బంకర్-బస్టర్ బాంబుల మీద బాంబు దాడి చేసింది తరువాత ఇరాన్ తన అణు కార్యకలాపాలను నిలిపివేసిందని చెబుతారు. ఏది ఏమైనా ఇరాన్ అణు కార్యక్రమాల మీద అమెరికాకు ఇజ్రాయెల్ కి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దాంతోనే ఈ యుద్ధం అంటున్నారు. ఈ యుద్ధంతో ఇరాన్ అణు కార్యక్రమాలనే కాదు ఆర్ధిక కార్యక్రమాలను పూర్తిగా దెబ్బ తీయాలన్న లక్ష్యం ఉందని అంటున్నారు. ఇరాన్ ఇప్పటప్పట్లో కోలుకోలేని విధంగా ఆర్ధికంగా దెబ్బ తీస్తేనే తప్ప దారికి రాదు అన్న ఆలోచన ఉంది. అందుకే ఈ జాయింట్ ఆపరేషన్ అని చెబుతున్నారు. ఖమేనీ మరణం తరువాత కూడా భీకర యుద్ధం సాగుతోంది అంటే ఇరాన్ నడ్డి విరించేందుకే అని అంటున్నారు. మొత్తానికి ఈ యుద్ధం అయితే ఇప్పట్లో ఆగేది ఉంటుందా అన్న చర్చ అయితే సాగుతోంది.