ఖమేని సమాచారం ఇచ్చిందెవరు .. చంపడానికి పట్టిన సమయం ఎంత ?
ఒక దేశాధినేతను మరో దేశం కిడ్నాప్ చేయాలన్నా, చంపాలన్నా మామూలు విషయం కాదు. చాలా ఖచ్చితమైన సమాచారం ఉండాలి.;
ఒక దేశాధినేతను మరో దేశం కిడ్నాప్ చేయాలన్నా, చంపాలన్నా మామూలు విషయం కాదు. చాలా ఖచ్చితమైన సమాచారం ఉండాలి. ఆ దేశాధినేత ఎక్కడ ఉంటున్నారు ?. ఏం చేస్తున్నారు ?. ఎవరితో కలుస్తున్నారు ?. ఇలా ఆయనకు సంబంధించిన చాలా ఖచ్చితమైన సమాచారం ఉండాలి. అప్పుడే టార్గెట్ ను పూర్తీ చేయగలరు. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కిడ్నాప్ మొదలుకొని, ఇరాన్ సుప్రీం ఖమేని హత్య వరకు ఖచ్చితమైన సమాచారమే కీలక పాత్రపోషించింది. మరి అమెరికాకు, ఇజ్రాయిల్ కు ఆ ఖచ్చితమైన సమాచారం ఎలా వచ్చింది ?. ఎవరు ఇచ్చారు ?. ఇరాన్ లో ఇజ్రాయిల్, అమెరికాకు ఖచ్చితమైన సమాచారం ఇచ్చే సోర్సెస్ ఏంటి అన్న ప్రశ్నలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి.
ఐదు, పది నిమిషాల్లోనే పని పూర్తీ :
అమెరికా, ఇజ్రాయిల్.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనిని టార్గెట్ చేసిన ఐదు, పది నిమిషాల్లోనే చంపేశాయి. దాదాపు ముప్పై మిసైల్లతో ఖమేని నివాసం ఉంటున్న ప్రాంతాన్ని ఎటాక్ చేశారు. దీంతో ఖమేనితో పాటు ఇతర ఉన్నతాధికారులు హతమయ్యారు. ఖమేని కూతురు, అల్లుడు, మనవరాలుతో పాటు ఇతర సిబ్బంది కూడా మరణించారు. ఖమేనిపై ఎటాక్ తర్వాత ఇరాన్ నిఘా వర్గాలు ఎదురుదాడి ప్రారంభిస్తాయని అమెరికా, ఇజ్రాయిల్ ముందే అంచనా వేశాయి. అందుకే ఖమేనిపైన, ఇరాన్ నిఘా వర్గాలపైన ఒకే సమయంలో దాడి చేశారు. దీంతో ఇరాన్ నిఘా వర్గాలు వెంటనే తిరిగి దాడి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ దేశాధినేతపై ఖచ్చితమైన దాడి చేసిన అమెరికా, ఇజ్రాయిల్ కు అత్యంత ఖచ్చితమైన సమాచారం ఉందన్న వాదన ఉంది.
చాలా రోజులకు ముందే రెక్కీ :
ఖమేని ఎక్కడ ఉంటారు ?. ఏం చేస్తారు ? ఆయన డైలీ రొటీన్స్ ఏంటి ? ఎవరిని కలుస్తారు లాంటి విషయాలపై మెస్సాద్ చాలా రోజులకు ముందే నిఘా వేసింది. ఇరాన్ లో ఉంటూ ఖమేని కదలికలను మెస్సాద్ అంచనా వేసింది. ఖచ్చితమైన అంచనాకు వచ్చిన తర్వాత ఇజ్రాయిల్ కు సమాచారం ఇచ్చింది. ఉన్నతాధికారులతో ఖమేని తన నివాసంలో చర్చలు జరుపుతున్నారన్న ఖచ్చితమైన సమాచారం ఇజ్రాయిల్ కు మెస్సాద్ పంపిన తర్వాతే భీకరమైన మిస్సైల్ దాడి చేసింది. అదే సమయంలో ఇరాన్ నిఘావర్గాలపై కూడా దాడి చేసింది.
మెస్సాద్ ఎవరు ?
ఇజ్రాయిల్ గూఢచారి సంస్థే మెస్సాద్. ఎలాంటి క్లిష్టతరమైన ఆపరేషన్లైనా సరే ఖచ్చితత్వంతో పూర్తీ చేస్తుందన్న చరిత్ర మెస్సాద్ కు ఉంది. శత్రుదేశాల కదలికలను నిత్యం గమనిస్తూనే, తన లక్ష్యాలను పూర్తీ చేస్తుంది. ప్రపంచంలో ఉన్న ఏ ఇతర దేశాలకు మెస్సాద్ లాంటి బలమైన గూడాచారి వ్యవస్థ లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఖమేని కదలికలను, సమాచారాన్ని అమెరికాకు, ఇజ్రాయిల్ కు ఇచ్చింది మెస్సేదే అన్న వాదన ఉంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రొగ్రాంకు వెళ్లకుండా అడ్డుకోవాలన్న లక్ష్యంతో ఇజ్రాయిల్, అమెరికా మొదలుపెట్టిన యుద్ధంలో మెస్సాద్ పాత్ర చాలా కీలకం.